వెట్టివేల్ మురుగనక్కి - హరోంహరా
వీరవేల్ మురుగనక్కి - హరోంహరా
జ్ఞానవేల్ మురుగనక్కి - హరోంహరా
శక్తివేల్ మురుగనక్కి - హరోంహరా
వేల్వేల్ - వెట్టివేల్
వేల్వేల్ - వీరవేల్
వేల్వేల్ - జ్ఞానవేల్
వేల్వేల్ - శక్తివేల్
పల్లవి :
వేల్ మురుగా వేల్ మురుగా వట్టివడి వేల్ మురుగా పళనికొండకొచ్చేమయ్యా
కావడిలో మ్రొక్కులన్నిమూట కట్టి నీకు తెచ్చి అభిషేకం చేసేమయ్య
శంకరయ్య కొమరనకి కావడి ఆట శరణాలు చెప్పుకొంటు ఆడుకొండాట
॥వేలమురుగా॥
వేల్వేల్ - వెట్టివేల్
వేల్వేల్ - జ్ఞానవేల్
వేల్వేల్ - వీరవేల్
వేల్వేల్ - శక్తివేల్
చరణం1 :
కావడిలో పాలు తెచ్చి పాలాభిషేకం చేస్తే ఆయుష్షును ఇచ్చేవయ్యా
పెరుగభిషేకం చేసి స్కందస్వామి శరణమంటే - సిరిసంపదలిచ్చేవయ్యా
శంకరయ్య కొమరనకి కావడి ఆట శరణాలు చెప్పుకొంటు ఆడుకొండాట
॥వేలురుగా॥
వేల్వేల్ - వెట్టివేల్
వేల్వేల్ - వీరవేల్
వేల్వేల్ - జ్ఞానవేల్
వేల్వేల్ - శక్తివేల్
చరణం 2 :
తేనాభిషేకంతో నిన్ను కొలిచినావారికి సకల విద్యలిచ్చేవయ్యా
భస్మభిషేకం చేసి శరణాలు చెప్పుకుంటే జ్ఞానమిచ్చుదాతవయ్యా
శంకరయ్యకొమరనకి కావడి ఆట శరణాలు చెప్పుకుంటు ఆడుకొండాట
॥వేలురుగా॥
వేల్వేల్ - వెట్టివేల్
వేల్వేల్ - వీరవేల్
వేల్వేల్ - జ్ఞానవేల్
వేల్వేల్ - శక్తివేల్
చరణం 3:
కన్నతండ్రి ముక్కంటికి జ్ఞానబోధ చేసిన గురుశరవణ భవుడవయ్యా
పళనికొండపై వెలసి భక్తులను పాలించే దండపాణి శరణమయ్యా
శంకరయ్య కొమరనకి కావడి ఆట శరణాలు చెప్పుకుంటూ ఆడుకొండాట
శరణాలు చెప్పుకుంటు ఆడుకొండాట ||4||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
లిరిక్స్ పంపినవారు :
*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*