స్కందామురుగా వడివేలా శరవణభవ - సుబ్రమణ్య స్వామి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


పల్లవి : 

స్కందామురుగా వడివేలా శరవణభవ శ్రీషణ్ముఖుడా - ||కోరస్||

శబరిగిరీశుడు - శ్రీ మణికంఠుడు అయ్యప్పస్వామికి - అగ్రజుడా ॥ స్కందా ॥ 

సుబ్రహ్మణ్యం - సుబ్రహ్మణ్యం - షణ్ముఖనాధా - సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం - సుబ్రహ్మణ్యం - స్వామినాధా- సుబ్రహ్మణ్యం || స్కందా ॥


చరణం -1 

పార్వతి నందన పళని వాసా వల్లినాధా - వరప్రదాతా||కోరస్||

మొపిదేవీ - స్థిరనివాసా కోర్కెలు తీర్చే - మోక్ష ప్రదాతా

శివశివశివశివసుబ్రహ్మణ్యం - హరహరహర సుబ్రహ్మణ్యం శంభోశంకరసాంబసదాశివ  - గురుశరవణభవసుబ్రహ్మణ్యం || స్కందా ॥


చరణం - 2 

శంకరనందన శరవణభవుడా కనికరించరా కావడి ప్రియుడా॥ కోరస్ ||

పాలకావడితెచ్చేమయ్యా గైకొనవయ్యా కావడిప్రియుడా 

పాలకావడి పూలకావడి - పన్నీరు కావడి మురుగనకే భస్మకావడి - చందనకావడి కుంకుమకావడి మురుగనకే ॥ స్కందా ॥ 


చరణం -3 

తిరుచందూరువేలనవయ్యా తిరుప్పర కుండ్రం దేవుడయ్యా ||కోరస్||

సర్పదోషం హరియించయ్యా ఋణగ్రహ భాధలు తొలగించయ్యా

వేల్ మురుగా ఆండీమురుగా స్కంధామురుగా - వడివేలా వల్లీనాధా - ఓంగురునాధా - సద్గురునాధా - వడివేలా॥ స్కందా ॥ 

(పల్లవి మొత్తం)


ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

లిరిక్స్ పంపినవారు : 

*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*




#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat