కనిపించని లోకములో కైలాసా శిఖరములో
వెలసెనులే శివ శంకరుడే ధరహాసపు నగవులతో
పొంగే గంగా భవాని యిమిడి పోయె నీ సిగలోనే
వెలిగే నెలరాజు తానే కొలువు తీరె నీ శిరసుననే
నీవే ఓంకార మూర్తిగా నీవే శంఖా నా దానిగా
ధ్యానింతురా మధురాస్మరణా
ఓ..ఓ.. పలికెనులే ఆ భావనలే మా హృదయపు అంచులలో
అర్థనారీశ్వరుడై అవని నెల్ల మురిపించావు
అడిగిన అభయాలనొసగి ఆత్మలింగమైమిగిలావు
నీవే జగమేలు స్వామిగా ముల్లోకముల దైవానిగా
పిలిచిన పలికే దైవముగా
ఓఓ.ఓ.. పలికెనులే ఆ భావనలే మా హృదయపు అంచులలో