హరహర హరహర హరమహదేవా
హరి ఓం హరి ఓం హరినారాయణ
కైలాసవాసా హరమహదేవా వైకుంఠవాసా హరినారాయణ
పార్వతిరమణా హరమహదేవా శ్రీలక్ష్మీరమణా హరినారాయణ
త్రిశూలధారీ హరమహదేవా శంఖు చక్రధర హరినారాయణ
నందివాహన హరమహదేవా గరుడవాహన హరినారాయణ
గజచర్మాంబర హరమహదేవా పీతాంబరధర హరినారాయణ
విభూతిసుందర హరమహదేవా చందనచర్చిత హరినారాయణ
అభిషేకప్రియ హరమహదేవా అలంకారప్రియ హరినారాయణ
బిల్వదళప్రియ హరమహదేవా తులసీదళప్రియ హరినారాయణ
పన్నగభూషణ హరమహదేవా పన్నగశయనా హరినారాయణ
పాపవిమోచన హరమహదేవా తాపనివారణ హరినారాయణ
స్థితిలయకారా హరమహదేవా లోకరక్షకా హరినారాయణ
దీనదయాళో హరమహదేవా దీనబాంధవా హరినారాయణ