సాకి...
అయోధ్య నగరమున వెలసిన సీతా రామ
ఈ భక్తుల మోరాలించి మమ బ్రోవరావయ్య
శ్రీరామచంద్రా శ్రీరామచంద్రా
పల్లవి :
ఈతడు ఓ రాముడు ఏకాంత వీరుడు
ఏతల జూచినా తానే యిరవు కొన్నవాడు
చిరుతప్రాయము నాడు శివుని విల్లు విరచి
మెరసి సీత పెళ్లాడి మించినవాడు
హరి పదునాలుగు వేల దానవుల నిమిషాన
జరసి తానొక్కడే చదివిన వాడు
ఓడక వెళ్లెక్కుపెట్టి ఊరకే ఒక్కమ్మున
ఏడు తాళ్లు ధరను కూలవేసిన వాడు
జాడగా కొండలచేత జలనిధి గట్టించి
వేడుకతో లంక మీది విడసినవాడు