కరుణ చూపుమా మాపైన శ్రీ వేంకటేశా
శరణమో శ్రీ శ్రీనివాసా వైకుంఠ వాసా
సదా నిను మది వేడితి దేవా
పదే పదే నిను పిలువగ రావా || కరుణ ||
చరణం 1:
నింగిని తాకిన ఆ కొండలపై బంగరు గుడిలో వెలిసావు
నీరజ లోచన శిలరూపుడవై కవియుగ దేవుడ వైనావు
నీవే దిక్కని నమ్మిన వారికి ఇలవేల్పుడవై కాపాడెదవు || కరుణ ||
చరణం 2:
ఏడు కొండలను ఎక్కుతు స్వామి నీ సన్నిధికి చేరాము
ముడుపులు తెచ్చి మ్రొక్కులు తీర్చగ నీ వాకిటను నిలిచాము
మా గోడును వినవా స్వామి నీ మోమును చూపవదేమి || కరుణ ||
చరణం 3:
గోవిందా హరి గోవిందాయని నీ నామ స్మరణముతో
గిరులు ఝరులు మారు మ్రోగగా భక్త కోటి నిను చేరెదరు
గరుడ వాహనా కానగ రావా దీన జనులను కావగలేవా || కరుణ ||
చరణం 4:
ఆపద మొక్కులవాడవు దేవా అనాధ రక్షక శ్రీ రమణా
అనవరతము నిను కొలిచిన వారికి భాగ్యము నీవె శుభచరణా
అప్పన్న దాసుడు నిను వేడగను చూపగ రావా నీ కరుణా || కరుణ ||