తుళ్ళి తుళ్ళి ఆడింది అందాల నాగు
మిలా మిలా మెరిసేటి బంగారు నాగు
పొద్దు పొడుపు వేళలో పుట్ట నుండి వచ్చింది
సూర్యభగవానునికి వందనము చేసింది
మెరిసేటి పొలుసుల నాగు శిరమందు మణితో నాగు
ఎగుడు దిగుడు దారుల్లోన బిర బిర కదిలింది
పరమశివుని మెడలోనా పరవశించి ఆడింది
శ్రీహరి సన్నిధిలోనా చిందులేసి ఆడింది
తన భక్తుల మధ్యన నాగు భలే గంతులేసి ఆడింది
మెలిక మెలిక నడకలతోటి సందడి చేసింది
మొగలి పూల పరిమళము సన్నజాజి పూ వనము
సంపంగి హారము నాగుమయ్య కిష్టము
ఆ పువ్వులన్నిటిని ఏరి నీ పుట్ట చెంతకు చేరి
రంగు రంగు మాలలు గట్టి మెడలో వేయనా
తోక మీద ఉన్నాయి తొంబై వేల మచ్చలు
నడుము పైన ఉన్నాయి నలభై వేల మచ్చలు
ఆ మచ్చల మధ్య స్వామి ఉన్నాయి ఎన్నో మహిమలు
శిరసు పైన ఉన్నాయంట సీతమ్మ పాదాలు