దిగి రారా నా స్వామి తిరుమల శిఖరాలు దిగి రారా - వేంకటేశ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


సాకి:

పరాకు చేయక ... మొరాలకించు....
బిరాన బ్రోవుమా... వరాల స్వామి.....
నీ... కరుణ తలంచవా..... దేవా..... తిరుమల.....దేవా....

పల్లవి:

దిగి రారా నా స్వామి తిరుమల శిఖరాలు దిగి రారా "2"

చరణం:1

నీ శిఖరాలను దాటగలేను  ఏ కానుకలు నీకిడలేను
నీ పద సన్నిధి చేరగలేను"2"
నీ కృప చూపరా వెంకటేశ్వర
     " దిగి రార  నా స్వామి తిరుమల శిఖరాలు దిగి రారా "

చరణం:2

వరముల నిమ్మని అడగములేరా
సిరి సంపదలు కోరను లేరా
అరమొర చేయక నా మొర వినరా"2"
దర్శన మీయరా వెంకటేశ్వర
" దిగి రారా నా స్వామి తిరుమల శిఖరాలు దిగి రారా "

చరణం:3

ఈ జగమంతా నీ దయచేతా
వెలుగును గాదా కలియుగ నాధ
దీనులేందరిని కావగలేదా "2"
తిరుమల సుందర వెంకటేశ్వర
"దిగి రారా తిరుమల శిఖరాలు దిగి రారా "


ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat