సాకి:
పరాకు చేయక ... మొరాలకించు....
బిరాన బ్రోవుమా... వరాల స్వామి.....
నీ... కరుణ తలంచవా..... దేవా..... తిరుమల.....దేవా....
పల్లవి:
దిగి రారా నా స్వామి తిరుమల శిఖరాలు దిగి రారా "2"
చరణం:1
నీ శిఖరాలను దాటగలేను ఏ కానుకలు నీకిడలేను
నీ పద సన్నిధి చేరగలేను"2"
నీ కృప చూపరా వెంకటేశ్వర
" దిగి రార నా స్వామి తిరుమల శిఖరాలు దిగి రారా "
చరణం:2
వరముల నిమ్మని అడగములేరా
సిరి సంపదలు కోరను లేరా
అరమొర చేయక నా మొర వినరా"2"
దర్శన మీయరా వెంకటేశ్వర
" దిగి రారా నా స్వామి తిరుమల శిఖరాలు దిగి రారా "
చరణం:3
ఈ జగమంతా నీ దయచేతా
వెలుగును గాదా కలియుగ నాధ
దీనులేందరిని కావగలేదా "2"
తిరుమల సుందర వెంకటేశ్వర
"దిగి రారా తిరుమల శిఖరాలు దిగి రారా "