తులసీ దళాలతో తులతూచుదామంటే
నీ రుక్మిణి నేనుకానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా...
యమునా తీరమందు రాసక్రీడ లాడంగ
రాధమ్మను నేనుకానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా
నా హృదయమే నీకు కోవెలగ చేయుటకు
మీరాను నేను కానురా కృష్ణయ్య అంత శ్రద్ధ నాకు లేదురా
వెన్న మీగడలతో నీ గోరుముద్ద తినిపించ
యశోదను నేను కానురా కృష్ణయ్య అంత నోము నోచలేదుగా
సంసారమే వదిలి సంకీర్తన చేయుటకు
త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య శరణాగతి
నాకు లేదురా
సంసార సoద్రాన సంతృప్తిగా నలిగాను
ప్రేమ అనే తెడ్డు వేయరా కృష్ణయ్య ఒడ్డుజేర్చి నన్ను బ్రోవరా