Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

శివుని మెడ చుట్టూ ముట్టి నల్లా నాగులో - నాగరాజ భజన పాటల లిరిక్స్


శివుని మెడ చుట్టూ ముట్టి నల్లా నాగులో నల్లా నాగులో
నీవు నిగా నిగా మెరిసేవు నల్లా నాగులో 
స్వామి ఒంటిమీద ఎన్ని నగలు ఉన్నా నాగులో
నీవు లేకపోతే అందమేది అయ్యా నాగులో


నీ ఒంటిమీద పొలుసు చూడు ఇంద్రధనస్సు మెరుపు చూడు
నీవు పడక విప్పి ఆడుతుంటే పరమశివుడు మురిసె చూడు
గుడ్లు నీవి పగడాలు నల్లా నాగులో
కనుగుడ్లు నీవి పగడాలు నల్లా నాగులో
నీ మెడలో మెరిసే చంద్రవంక నల్లా నాగులో


నడకనయాగారమయా రూపు జటాకారమయా
నిత్యము పరమేశ్వరుని సేవలో తరింతువయా
లోకమంత పూజ నీకు నల్లా నాగులో
భూలోకమంత పూజ నీకు నల్లా నాగులో
పాల వరద నీకు పంచమినాడు నల్లా నాగులో


విష్ణుమూర్తి సేవ చేయ శేష పాన్పు వైనావు
భూదేవి సేవ చేయ భూమిని తల మోశావు
ఎంత దయా గుణము స్వామి నల్లా నాగులో
నీదెంత దయా గుణము స్వామి నల్లా నాగులో
నీ మహిమ చూపు మా పైన నల్లా నాగులో

📢 Follow