ఓరోరి గణపతి రా నీ బొజ్జ నిండా వుండ్రాలు పోసేమురా
ఎలుక వాహనము నెక్కి కులుకూతూ వచ్చి నీవు
కుడుమూ లుండ్రాలు మెక్కి ఇడుములా బాపి పోరా
||ఓరోరి గణపతి రా||
అరటి దానిమ్మ పళ్ళు వెలగ మారేడు పళ్ళు
అల్లో నేరేడు పళ్ళు ఆరాగించంగా రారా
||ఓరోరి గణపతి రా||
పులిహోర పొంగళ్ళు పప్పు నెయ్యి దప్పడాలు
పంచా భక్షాలు ఆరాగించి పోదువు రారా
|| ఓరోరి గణపతి రా||
గరికా పరకాలు బెడితే పరమానందము నీకు
చెరుకు ముక్కాలు బేడితే చెప్పిదేమున్నాది ఇంకా
||ఓరోరి గణపతి రా||
పిలుపులనందుకొని చెలువారా వచ్చినీవు
కాలువాలా పూజాలంది కలుమూల నిచ్చిపోరా
||ఓరోరి గణపతి రా||
పందా దారా విల్లు పంచ పూల బాణాలు
పాశాంకుశాలు బట్టి కంచి గణపతి రారా
||ఓరోరి గణపతి రా||
ఎల్లా లోకాలు నెలే ఏకైక సామివి నీవు
ఎల్లా వేళాల మమ్ము చల్లంగా చూడ రారా
|| ఓరోరి గణపతి రా||
వెండి కొండయ్య కూతురి బంగారు కొండావంటా
నిండుగా నూ కొలువుంటే పండు బంగారు పంట
||ఓరోరి గణపతిరా||