శ్లోకం...
శివుడే... బ్రహ్మ... శివుడే విష్ణువూ...
ఓంకారమే... శివమయం...
పల్లవి:
చంద్రకళాదర పూజలు గొనరా
ఫణిదర జలదర హిమకర శంకరా
!! చంద్ర !!
మా మదియే నీకు మందిరముగ జేసి
మమతల పూదండ విరితోరణము జేసి
ఆశ ధ్యాసల జ్యోతులు వెలిగించే...
మనసు విరియగా విరిసి ఆడగా భవహరనా
పిడికెడు గుండెల పీఠం వేసి
కడలిని మించిన భక్తిని నిలిపే
హరహర పురహర భవహర శంకర మొర వినవా...
!! చంద్ర !!
చిరునవ్వుతో విరులు సింగార మొలకించే
మళయ మారుత వేళ తరులన్ని పులకించె
తూర్పున భానుడు ఉదయించు వేళాయే
గిరులు వేడగా ఝరులు ఆడగా శుభ చరణా
కిలకిల రాగం విహంగ గీతం
ప్రసన్నవదనం ప్రకృతి పదణం
హరహర పురహర భవహర శంకర మొర వినవా...
!! చంద్ర !!