అందాల అమ్మకు విజయ దుర్గతల్లికి
సిరు నగవులు గలవమ్మా వేరు నగలు ఏలమ్మా
"అందాల అమ్మకు విజయ దుర్గ తల్లికి
"అందెలతో అయ్యయ్యే కందెను పాద పద్మములు
కంకణా భరములతో కందెను కర కములు"2"
ముక్కెరతో నాసిక కడు చిక్కులతో నొక్కను"2"
హారములు మెడపైన ఎడములేక నలిగెను
"అందాల అమ్మకు విజయ దుర్గతల్లికి "
'నవకిసల కర తలమున ఏల నీలి కములమూ
కలువ కనుల వెలిగే చెవులకేల దిద్దులూ
లేని నడమ పైన ఏల ఘనమగు వడ్డాణమూ "2"
నగలకే నగయైన తనువు కేల సరి సరమూ
" అందాల అమ్మకు విజయ దుర్గ తల్లికి "
పరమ కరుణ అణువణున పొంగిపొరలి పై కేగసి
సురు శిరముగ సరియైన కిరటమై వెలిగేను"2"
తను కల్పవల్లిగా మనస్సు వాత్సల్యమూ "2"
మరి మరి విరి సొముముతే విరిసి విరుల గెలిచెనూ
"అందాల అమ్మకు విజయ దుర్గ తల్లికి "