నీ కోసమెంతో వెతికామురా శ్రీ వేంకటా రమణా - వేంకటేశ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

నీ కోసమెంతో వెతికామురా శ్రీ వేంకటా రమణా - వేంకటేశ భజన పాటల లిరిక్స్


నీ కోసమెంతో వెతికామురా శ్రీ వేంకటా రమణా
ఒక్కసారీ ఎదుట కనిపించరా

ఎత్తైన ఏడు కొండల్లో వెలసీ
ప్రతి వారి యిలలోన సాక్షాత్కరించీ
ఎనలేని భోగాలు నీవనుభవించీ
కోరిన కోరిక లొసగేటి స్వామీ 
శ్రీ వెంకటా రమణా ఒక్కసారీ యెదుట కనిపించరా

బంగారు కలశాన శిఖరాన వెలసీ
భక్తుల హృదయాల కుసుమాలు విరసీ 
ప్రతివారు గోవింద గోవింద యనుచూ
పలుమారు గోవింద గోవింద యనుచూ
నిను చూసి ధన్యత పొందేము స్వామి
శ్రీ వెంకటా రమణా ఒక్కసారీ యెదుట కనిపించరా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow