రావమ్మ ..... రావమ్మ మా ఇంటికి - అమ్మవారి భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

రావమ్మ ..... రావమ్మ మా ఇంటికి - అమ్మవారి భజన పాటల లిరిక్స్


రావమ్మ .....
రావమ్మ మా ఇంటికి
అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
నువ్వు రావాలమ్మా మా ఊరికి
అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి

నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరం ఉన్నది
నువ్వు కట్టుకోను కంచి పట్టు చీర ఉన్నది
ఆపైన మందార పువ్వులున్నవి
నీ పూజ కోసమే వేచి ఉన్నవి
రావమ్మ ......
రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి
అమ్మ పరమేశ్వరి

ఆకలేస్తే అన్నపూర్ణ వై నావమ్మ
మాకు చదువు చెప్పే సరస్వతి నీవేనమ్మ
బెజవాడ దుర్గమ్మ నీవేనమ్మ
శ్రీశైల భ్రమరాంబ నీవేనమ్మ
రావమ్మ .....
రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి

మల్లెపూల మాలలే తెచ్చినామమ్మ
నీకు సన్నజాజి పువ్వులే తెచ్చినామమ్మ
గులాబీ పువ్వులు తెచ్చినామమ్మ
నీ పూజ కోసమే వేచినామమ్మ
రావమ్మ ....
రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి

రాజరాజ రాజా రాజ రాజేశ్వరి
విజయవాడ కనకదుర్గ పరమేశ్వరి
మీసేవ కోసమే వచ్చినామమ్మ
చల్లంగా మమ్ములను దీవించదమ్మా
రావమ్మా ....
రావమ్మ మా ఇంటికి
అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి
నువ్వు రావాలమ్మా మా ఊరికి
అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow