పరిజ్ఞానం - కార్తీక దీపాలు నీటిలో ఎందుకు వదలాలి?

P Madhav Kumar


*దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం.*


*దైవ భక్తి ఉన్నవారు సంవత్సరం మొత్తం దీపం వెలిగించకపోయిన కార్తీక మాసం నెల రోజులు దీపం వెలిగిస్తే చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు.*


*కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వలన సంతానాన్ని పొందాడనీ, వారి కుమారుడైన శత్రుజిత్తు ఈ మాసంలో దీపాన్ని వెలిగించడం వలన కైలాసాన్ని చేరుకున్నాడనీ కథలున్నాయి.*


*ఈ నెలరోజులూ ఇంట్లో దీపాల కన్నా చెరువులు, నదుల్లో దీపాలు వదులుతుంటారు. ఏ నదీతీరం చూసినా కార్తీక స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో కళకళలాడుతుంటంది. సూర్యోదయం అయ్యే సమయానికి నదీతీరం మొత్తం దీపకాంతులతో నిండిపోతుంది. ఇంతకీ కార్తీకమాసం నెలరోజులూ నదుల్లో, చెవులుల్లో దీపాలు ఎందుకు విడిచిపెడతారు.... .దీని  వెనుకున్న ఆంతర్యం ఏమిటి?*.


*నమామీశ్వరం ప్రాణేశ్వరం*

*పంచభూతేశ్వరం*

*అనాదీశ్వరం ఆదీశ్వరం*

*సర్వకాలేశ్వరం*

*శివమ్ శివమ్ భవ హరం హరం*

*శివమ్ శివమ్ భవ హరం హరం*


*ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి.. పంచభూతాలు, సకల ప్రాణికోటికీ జీవనాధారాలు.*


*శివ పంచాక్షరీ మంత్రం అయిన న-మ-శి-వా-య అనే పంచ బీజాక్షరాల నుంచి పంచ భూతాలు, వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రవచనం.*


*శివ అనే శబ్దానికి శుభం, క్షేమం, శ్రేయం, మంగళం అని అర్థాలున్నాయి. ఈ జగత్తంతా శివమయమే అయినప్పుడు అంతా శివోహమే.*


*పంచభూతాలను కూడా తనలో లయం చేసుకుని పరమశివుడు కొలువైన క్షేత్రాలు పంచభూత క్షేత్రాలు.*


*ఇంతకీ కార్తీక మాసంలో దీపాలను నీటిలో ఎందుకు వదిలిపెడతారన్నది చెప్పకుండా ఇదంతా ఏంటంటారా..*


*ముందుగా శివం-పంచభూతాత్మకం అని తెలిసినప్పుడే దీపాలు నీటిలో ఎందుకు వదిలిపెడతామనేది అర్థమవుతుంది.*


*ఆత్మ జ్యోతి స్వరూపం.*


*ఆత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తారు. మనలో ఉండే ఆత్మ జ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుతుందంటారు*


*జ్యోతి స్వరూపం అంటే దీపాన్ని, పంచభూతాల్లో ఒకటైన నీటిలో వదలడం అంటే మనలోని ఆత్మని పంచభూతాత్మకం అయిన పరమేశ్వరుడి అంకితం చేయడమే.*


*ముఖ్యంగా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో దీపాలు వెలిగించి నదుల్లో, చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటూ ఈ జన్మలో చేసిన పాపాలు నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతామంటారు.*


*అందుకే బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి త్రికరణ శుద్ధిగా కార్తీక దీపాలు నీటిలో విడిచిపెడతారు.*


*అన్ని మాసాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలకన్నా.. కార్తీక మాసంలో చేసే ఉపవాసం,స్నానం, దానం ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.*


*విష్ణువును తులసి దళాలు, కమలం,జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతో.... శివుని బిల్వ దళాలు, జిల్లేడు పూలతో అర్చిస్తే వారికి ఉత్తమగతులు కలుగుతాయంటారు.*


*ఈ మాసంలో నిత్యం సూర్యోదయానికి ముందే స్నానంచేసి గుడికి వెళ్లి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుంది. నెలంతా సాధ్యం కాని వారు కనీసం సోమవారం, కార్తీక పౌర్ణిమ, ఏకాదశి రోజుల్లో అయినా ఇలా చేస్తే మంచిదంటారు.*


*సర్వేజనాసుఖినోభవంతు.*

*లోకా సమస్తా సుఖినోభవంత్।*

 *శుభమస్తు.*


*ఓం నమో భగవతే దామోదరాయ

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat