గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామి - గురువు భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామి
నీతోడులేనిదే గురుస్వామి, మేము శబరియాత్ర చేయలేము గురుస్వామి 
 ||గు||
కార్తీకమాసమున మాలనే వేస్తావు శరణుఘోష మంత్రము నేర్పిస్తావు
అడవిలోన స్వాములకు కష్టము వస్తే అండగా నిలిచి ఆదరిస్తావు 
 ||గు||
నీవెంటవచ్చే స్వాములకు గురుస్వామి తీసుకొని వెడతావు గురుస్వామి
నీతోడు లేనిదే గురుస్వామి ఇరుముడిని కట్టలేము గురుస్వామి 
 ||గు||
గురువులేని విద్య విద్యకాదు గురువులేని యాత్ర శబరియత్రకాదు
నీ అనుగ్రహము లేనిదే గురుస్వామి అయ్యప్ప దర్శనము కలగదులే గురుస్వామి 
 ||గురు||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat