స్వామిని నమ్ముదమా... గురుస్వామిుని నమ్ముదమా........
స్వామిని నమ్ముదమా... గురు స్వామిని నమ్ముదమా మాల వేసి నియమాలను తెలిపే స్వామిని నమ్ముదమా.... మన గురు స్వామిని నమ్ముదమా... //2//
జన్మకర్మమును తెలుసుకొమనెను, తల్లి తండ్రులను మరువకనెను
ముక్తి కొరకు భగవంతుని వేడగా, మనసును మంత్రము చేయమనెను
భక్తి తోటి భగవంతుని కొలువగ గురువుగ తానే దర్శనమయ్యెను.
స్వామిని నమ్ముదమా...
కామక్రోధ మధ లోభములొదటగా స్వామిమాలతో దారి జూపెను...
అంబ వైపు పాదాలు సాగగా వనయాతరలో వెంట నడిచెను..
అత్య తోటి పరమాత్మను వేడగా గురువుగ తానే దరణమయ్యెను
స్వామిని నమ్ముదమా....
మంచి మార్గముపదేశమిచ్చెను, మానవ సేవలో నిలువుమనేను
సనాతన ధర్మాలను చూపి, సమ భావనతో మెలుగమనేను
తల్లితండ్రి తర్వాతెవరనగా గురువుగ తానే దక్షిణమయ్యెను
స్వామిని నమ్ముదమా....