Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

కనకదుర్గమ్మా కైలాసరాణి - అమ్మవారి భజన పాటల లిరిక్స్


కనకదుర్గమ్మా కైలాసరాణి
కాపాడవమ్మా భవానీ
కాపాడవమ్మా భవానీ

జగదేకమాతా జయమీయవమ్మా
పగబూనకమ్మా పసివారమమ్మా 

మణిమకుటధారీ మలయవిహారీ
మహారాజపుత్రీ మన్నించు గౌరీ

నీలాలకురులు ముఖమంత కళలూ
నెలవంక సిగలో దాగేను ఇలలో

నిత్యము నిను కొలిచే బెజవాడలోన
విచిత్రముగ చూపి నీ లీలలమ్మా

సింహసంహారీ సూర్యప్రకాశీ
సన్యాసరాజు పుణ్యాలరాశి

📢 Follow