Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

పూజ చేద్దాము రారమ్మా ఈవేళ లక్ష్మికి - అమ్మవారి భజన పాటల లిరిక్స్


పూజ చేద్దాము రారమ్మా ఈవేళ లక్ష్మికి
పూజ చేద్దాము రారమ్మా
పూజ చేద్దాము రారే రాజీవనేత్రులారా
జాజిపూల పూజ రోజు మా లక్ష్మీదేవికి

ఎచ్చయిన నిత్యమల్లెలు ఎర్రని పొగడ పూలు
పచ్చాని కనకాంబరాలు తెచ్చి శ్రీలక్ష్మీదేవికి

బంతీ చేమంతి పూలు బంగారువన్నె పూలు
దొంతూ గన్నేరు పూలతో మహాలక్ష్మీదేవికి నిండుగా

నందివర్ధనములు నాగమల్లె పూలు
మందార కుసుమ పూలతో మహాలక్ష్మీదేవికి ఇప్పుడు

దేవకాంచనములు విరిసిన మల్లెపూలు
తావి దాగిన పూజ రోజు మహాలక్ష్మీదేవికి 

📢 Follow