శివుడా - భవుడా - శంభోహరాయని
ఎన్ని సార్లు పిలిచినా పలుకరావు ఎందుకని
కరుణించగ భక్త వరద కాన రావయా
దేవా నీ శరణు కోరి వేచి నామయా
|| శివుడా ||
దేవా ఆ కైలాసము వీడి దరికి రావయ్యాభక్త కోటి మొరలు విని వరము లీయ వేమయ్యా
భోళా శంకరుడవయా- దేవా భక్త సులభుడవయా
హే సదాశివా నీదు స్మరణ మాకు ప్రాణమేనయ్యా
|| శివుడా ||
గంగాధర గరళ కంఠ హే పార్వతి మనోహరా
లింగ రూప భుజగ భూష ప్రమధ నాధ గణాధిపా
జంగమేశ్వరా భవా - దిగంబరేశ్వరా శివా
హే మంగళాకర హరహరా మమ్ముకావరా ఈశ్వరా
|| శివుడా ||
స్వామి నీ పూజలు చేయ పూలు తెచ్చి నామయ్యాపాలు తేనె జలములతో నిత్యము అభిషేకమయ్యా
తోడు నీడ నీవయా - మా కన్నతండ్రి వీవయా
నీ చరణ కమల సేవ మాకు స్వర్గం కన్నా మిన్నయా
|| శివుడా ||
దేవా ఈ సృష్టి స్థితి లయకారుడ వీవయ్యానీవులేని తావు లేదు ఆదిదేవ శివయ్యా
నిర్వి కారుడవయా - నిన్నేడ వెదుకమయ్యా
ఈ దీనజనుని అప్పన్న దాసుని బ్రోవగ రావేమయ్యా
|| శివుడా ||