Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

ఓంకార నాదం మా జీవ ప్రాణం - శివ భజన పాటల లిరిక్స్


ఓంకార నాదం మా జీవ ప్రాణం
కరుణించరా ఓ ఈశ్వర శరణు గంగాధర శంకరా

జగములనేలే జంగమ దేవా
నీ నామ స్మరణమే నిరతము రక్షా
ప్రణయ చరాచరా గంగా జటాధర
అందెలు ఘల్ ఘల్లనా నీ నాట్యమే మురిపించేరా
జగమంత లయలోన ఊగేనురా

నిర్జితహంకార నిఖిలైకవీరా
విభూషితాంబుజ దుర్ధాంత శీలా
రక్షింప శిక్షంప నీవే శివా కరుణా సముద్రా నీవే భవా

శ్రీశైల లింగా ........ఓ జంగమలింగా
మల్లేశ లింగా .....ఓ పరిషిత ప్రాణా
అణువు అణువులో ఓంకార నాదాలు
వీణా వేణువై పలికే
కాపాడరా హరా శంకర కరుణించరా దేవదేవా

📢 Follow