సాకి...
శిరమున గంగను మోయుచు
కరమున ఢమరుకము దాల్చి కడు భీకరమౌ
యురగము మెడలో నాడగ
పరికింతువు భక్త జనుల మానస తలపుల్.
పల్లవి:
శివ నామమే నా గానము,
ఓంకారమే నా ప్రాణము
అను పల్లవి:
శంభో శంకర, సాంబ సదాశివ,
కైలాస వాస, గిరిజా రమణా.
నీ గుణ గానము చేసెదమయ్యా
సరిగమ పదనిస స్వరములు పలుకగ
భరత నాట్య విన్యాసము చూపిన
భయనాశంకర భవహర శంకర.
!! శివ !!
నీ గళమందున గరళము నింపి
ప్రళయమునాపిన ప్రణవ మూర్తివే
భజనలు చేసే భక్త జనావళిని
బ్రోవగ రావా గావగ లేవా.
!! శివ !!
నంది వాహనా నాగాభరణా
పార్వతి రమణా పన్నగ భూషణ
ఫాల విలోచన పాప విమోచన
పరమ దయాకర పాహి ప్రసన్నా
!! శివ !!