తులసి మాలవేసుకుంటనే
నన్నుగన్న తల్లి నీకు దండమే
తనవు పులకరిస్తు ఉన్నదే
ఐదుకొండలెక్కలన్న ఆశనే
మాయ్యమ్మా.............. మణికంఠను చూసొస్తెనే
ఓయమ్మా............ నేను కనులార మొక్కొస్తనే.
చన్నీటి స్నానము చేస్తనే
మన కన్నీటి బాదలు తొలుగునే
నిష్టగా పూజలు చేస్తనే
స్వామి తప్పక దీవెనలిస్తడే
మాయమ్మా................మణికంఠను చూసొస్తనే
ఓయమ్మా.............నేను కనులారా మొక్కొస్తనే.
స్వామి నలబై ఒక్క ధీక్షనే
శరణుగోష పలుకుతుంటే మంచిదే
తలపైన ఇరుముడి మొస్తనే
పాదయాత్ర చేస్తె ఎంతో పుణ్యమే
మాయమ్మా.............మణికంఠను చూసొస్తనే
ఓయమ్మా...........నేను కనులారా మొక్కొస్తనే.
పజ్జెంది పడి మెట్లు ఎక్కితె
పూర్వ పాపాలన్ని పారిపోవునే
బంగారు రూపాన్ని చూస్తనే
బోగ భాగ్యాలు మన చెంత చేరునే
మాయమ్మా..........మణికంఠను చూసొస్తనే
ఓయమ్మా............ దివ్యజ్యోతిని ధర్శిస్తనే.....!
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి చూడండి.