చండీ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే కోరికన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మాతృదేవత అనుగ్రహంతో లక్ష్మీదేవి, పార్వతీ దేవి, సరస్వతి దేవి కలిసి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరించారు. త్రిశక్తి స్వరూపిణి అయిన మహాచండీని ప్రార్థిస్తే సర్వదేవతలనూ కొలిచినట్లేనని భక్తుల విశ్వాసం. సింహ వాహనంపై కొలువుదీరిన మహాచండీ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహాచండీ రూపంలో ఉన్న అమ్మవారిని ప్రార్ధిస్తే విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారతారన్న ప్రతీతి ఉంది.
మరోవైపు పలు పుణ్యక్షేత్రాల్లో ఈ రోజు అమ్మవారిని స్కందమాతగా ఆరాధిస్తారు. ఈ అవతారంలో బాల కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని అమ్మవారు దర్శనమిస్తుంది. శివగణాలకు స్కందుడు సైన్యాధిపతి. పైగా జ్ఞానానికి కూడా అధిపతి. ఇక అమ్మవారేమో తన చల్లని చూపుతో సకల ఐశ్వర్యాలనూ అనుగ్రహించే తల్లి. అందుకే ఈ స్కందమాతని పూజిస్తే అమ్మవారితో పాటూ కుమార స్వామి ఆశీస్సులూ లభిస్తాయని పండితులు చెబుతారు.
‘స్కందయతీతి శత్రూన్ శోషయతీతి స్కందః’
శత్రువులను శోషింపచేయువాడు కనుక పార్వతీ తనయుడికి స్కందుడు అని పేరు. ఈయనకే కార్తికేయుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు అని పలు పేర్లు కలవు. స్కందుని తల్లికావడం వల్లే అమ్మవారికి ‘స్కంద మాత’ అని పేరు. నవదుర్గలలో ఇది ఐదో రూపం.
సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా
శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ॥
స్కందమాత వాహనం సింహం. తెల్లని రంగుతో ప్రకాశిస్తూ నాలుగు చేతులు, మూడు నేత్రాలు కలిగి ఉంటుంది. తన కుమారుడైన బాలస్కందుడిని ఒక చేతితో ఎత్తుకుని, రెండు చేతుల్లో పద్మాలు ధరించి, మరో చేతితో అభయమిస్తూ కనిపిస్తుంది. స్కందమాత సకల శుభాలనూ అనుగ్రహిస్తుంది. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇంద్రియ నిగ్రహంతో, మానసిక ఏకాగ్రతతో, నిస్వార్థంగా ఆరాధించే భక్తులకు ఇహపర సుఖాలను, ముక్తిని ప్రసాదిస్తుంది.
నైవేద్యం: పులిహోర, రవ్వకేసరి, గారెలు

లక్ష్మీదేవి స్తోత్రాలు
పార్వతీదేవి స్తోత్రాలు
సరస్వతి దేవి స్తోత్రాలు
నవరాత్రులు 5 వ రోజు - శ్రీ మహా చండీ దేవి
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉🕉️🕉🕉️🕉
♦️ఐదవరోజు అమ్మవారి అలంకారము శ్రీ మహా చండీ దేవి:
దేవీం షోడశవర్షీయాం రమ్యాం సుస్థిరయౌవనామ్
సర్వరూప గుణాఢ్యాం చ కోమలాంగీం మనోహరామ్l
శ్వేతచంపకవర్ణాభాం చంద్రకోటిసమప్రభామ్
వహ్నిశుద్ధాంశుకాధానాం రత్నభూషణభూషితామ్ll
చండీ దేవి కాళీదేవిని పోలి ఉంటుంది. ఒక్కోసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. చండీ దేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, లేదా హైమవతి, శతాక్షి, శాకంభరీ దేవి, అన్నపూర్ణ, జగన్మాత మరియు భవాని అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గ, కాళి మరియు శ్యామ, చండీ లేదా చండిక, భైరవి, చిన్నమాస్త మొదలైన పేర్లతో పిలువబడుతుంది.
చండీదేవి యొక్క పూజ ఆశ్వయుజ మరియు చైత్ర మాసాల శుక్ల ప్రతిపద నుండి నవరాత్రులలో ఒక ప్రత్యేక వేడుకతో భక్తులు జరుపుకుంటారు. నవరాత్రుల మహోత్సవాలల్లో తల్లి చండీ దేవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
🌻చండీ దేవి ఎలా అవతరించింది:
పూర్వకాలంలో "శుంభ", నిశుంభ" అనే రాక్షస రాజులు దేవతల రాజధాని అయిన స్వర్గాన్ని ఆక్రమించారు. ఇంద్రుడిని, దేవతలను స్వర్గం నుండి వెళ్లగొడతారు. దేవతల ప్రార్థనలను విన్న పార్వతి వారి రక్షణార్థం చండిగా అవతరించింది. ఆమె సౌందర్యానికి మోహించిన శుంభుడు ఆమెను వివాహమాడాలని కోరుకుంటాడు. ఆమె వ్యతిరేకిస్తుంది. ఆమె తిరస్కారాన్ని ఆగ్రహించిన శుంభుడు రాక్షస సేనాదిపతులైన "చండ", "ముండ" లను ఆమెను హతమార్చుటకు పంపిస్తాడు.
వారు ఆమె క్రోధం నుండి జనించిన చాముండి ద్వారా హతులౌతారు. శుంభ, నిశుంభులు కలసి చండికను హతమార్చాలని ప్రయత్నిస్తారు కాని ఆమె చేతిలో మరణిస్తారు. వారిని వధించిన తర్వాత చండిక కొంతసేపు నీల్ పర్వతం పై విశ్రమించినట్లు పురాణ కథనం. అందువలన ఆ ప్రదేశంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ప్రాంతంలో గల రెండు పర్వత శిఖరాల పేర్లు "శుంభ", "నిశుంభ".
చండీ దేవి ఆలయం నీల్ పర్వతం పై చాలా ప్రత్యేకమైనది. ఈ దేవాలయం ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయ విగ్రహాన్ని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్య రూపొందించారని అక్కడి ప్రజలు నమ్ముతారు. చండీ దేవిని ఇక్కడి ప్రజలు రెండు రూపాల్లో పూజిస్తారు. నవరాత్రులలో అష్ఠమి మరియు నవమి నాడు చండీ దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. మహా చండీ దేవి ఉగ్రరూపంలో దర్శనం ఇస్తుంది.
ఈరోజు అమ్మవారిని ఎరుపురంగు చీరలో అలంకరిస్తారు. అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టాలి. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి ధైర్యం, విజయం సిద్ధిస్తుంది.
నైవేద్యం: కట్టు పొంగలి, పులిహోర.
శ్రీ మాత్రే నమః…🙏🙏