జయా జయా హారతి - గైకొనవమ్మా పార్వతి
శరణు సుదీమతి - శంభూని ప్రియాసతి
టెంకాయ నీళ్ళు - గంగా ఉదకం
అభిషేకంబులు చేసెద - అభిషేకంబులు చేసెద
మల్లెపువ్వుల మాలలు గ్రుచ్చి
పార్వతి నీమెడలేసెద - పార్వతి నీమెడలేసెద
తుమ్మి పువ్వుల మాలలు గ్రుచ్చి
ఈశ్వర నీమెడలేసెద - ఈశ్వర నీమెడలేసెద
పసుపు కుంకుమ పరిమళంబులు
పార్వాతి గైకోనుమా - ఈశ్వరా గైకోనుమా
పంచా భక్షా పరమానంబులు
పార్వాతి గైకోనుమా - ఈశ్వరా గైకోనుమా
కరుణాతో కర్పూరా హారతి
కాంతారో గైకోనుమా - ఈశ్వరా గైకోనుమా
ముదముతో ముత్యాలా హారతి
ముందుగా గైకోనుమా - ముందుగా గైకోనుమా
అఖిలాండేశ్వరి హారతి గొనుమా
అష్టైశ్వర్యములివ్వుమా - అష్టైశ్వర్యములివ్వుమా
జయా జయా హారతి - గైకొనవమ్మా పార్వతి
శరణు సుదీమతి - శంభూని ప్రియాసతి