శ్రీ సరస్వతీ దేవి
రంగు: తెలుపు
పుష్పం: మారేడు దళాలు
ప్రసాదం: కట్టుపొంగలి
దసరా నవరాత్రులలో అమ్మను శ్రీ సరస్వతీ దేవి గా అలంకరిస్తారు.
శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణములు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనముగా అధీష్ఠించి వీణ, దండ, కమండలము, అక్షమాల ధరించి అభయ ముద్రతో భక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసభగవానుడు, వాల్మీకిమహర్షి, కాళిదాసు మున్నగు లోకోత్తర కవులకు, పురాణ పురుషులకు అమ్మ వాగ్వైభవమును వరముగా అందచేసింది. అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుధ్ధిని వికాసము కలుగుతుంది. త్రిశక్తి స్వరూపములలో సరస్వతీదేవి మూడొవ శక్తిరూపము. సంగీత సాహిత్యములకు అమ్మ అథిష్టాన దేవత. సకల జీవుల జిహ్మాగ్రముపై అమ్మ నివాసము ఉంటుంది.
శ్రీ సరస్వతీ దేవి స్తోత్రాలు
శ్లోకం:
యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా, యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా, సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా.
శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీని పురాణాలు అభివర్ణించాయి. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి.
🍃🌷అమ్మవారు ఈ రోజున "శ్రీ సరస్వతీదేవి గా" తెల్లని వస్త్రాలు ధరించి దేదీప్యమానంగా వెలుగుతూ మన పూజలు అందుకుంటుంది.
సరస్వతి ధరించే వీణ పేరు: కఛ్ఛపి
చేతిలో జపమాల: ఆధ్యాత్మికతను అభివృద్ధి చేయును
మరొక చేతిలో వేదములు: అనగా జ్ఞానమును ఇచ్చును
వీణ: సంగీత సాహిత్యము నాదము
త్రిశక్తి రూపాల్లో సరస్వతి దేవి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ మాత కేవలం చదువులనే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని శ్రీదేవీ భాగవత నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి.
బ్రహ్మ సరస్వతిని సృష్టించాడని ఒక గాధ ఉన్నా, దేవీ భాగవతం ప్రకారం, సృష్టి కార్యంలో సహాయం చేయడానికి శ్రీమాత సరస్వతిని బ్రహ్మకు ప్రసాదించిందని చెప్పబడింది.
⚜️అలంకరించే చీర: తెలుపు
⚜️నైవేద్యం: అటుకులు, బెల్లం, సెనగపప్పు, కొబ్బరి
🍃🌷శ్లోకం:
యా కుందేందు తూషారహారధవళా యాశుభ్రవ స్త్రాన్వీతా యావీణ వరదండ మండితకరా యాశ్వేత పద్మాసనాl
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభుథిభి: దేవై: సదా వందితా సామాంపాతు సరస్వతి భగవతీ నిశ్శేషజాఢ్యాపహాll
🌷భావము:
మల్లెపువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వలె తెల్లగా, స్వఛముగా ఉండి, తెల్లని చీర ధరించి, చేతిలో వీణతో, తెల్లని పద్మమునందు ఉండు ఓ సరస్వతి దేవీ! బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడు పూజింపబడు ఓ భగవతీ!! నాలోని అజ్ఞానమును పోగొట్టి నన్ను ఎల్లప్పుడూ రక్షించుము.
ఈ శ్లోకములో సరస్వతి దేవి ధరించినవన్నీ తెలుపులో వున్నాయి. తెలుపు సాత్విక గుణము. జ్ఞానము. తెల్లపువ్వు వలె, చంద్రునివలె,(తూషార)మంచు వలె, హారధవళ - ముత్యాలహారము. తెల్లని వస్త్రములు ధరించినది. వీణ ధరించి తెల్లని పద్మములో ఆసీనురాలయినది.
🍃🌷జ్ఞాన ప్రదాతగా సరస్వతి – కొన్ని గాధలు:
పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు.
అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడిగాడు.
వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని పొందాడు. వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని , పురాణ రచనను చేశాడు.
ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు. శివుడు పాటు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు.
పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు.
అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు , జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన , జ్ఞాపక శక్తులను ప్రసాదించమని , విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంధ రచనా శక్తి , ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు.
సత్సభలలో మంచి విచారణ శక్తిని , సత్య స్వరూపిణి , వ్యాఖ్యాన రూపిణి , వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా , సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో ఉంది.
🌷కొన్ని ఆలయాలు:
ఆంధ్రప్రదేశ్..బాసర
కాష్మీర్ లోని శారదా మందిరం
ర్ణాటక..శృంగేరి:
కర్ణాటక లోని శృంగేరిలో ఆదిశంకరాచార్యులచే ప్రతిష్టింపబడిన సరస్వతీ మూర్తి
తమిళనాడు..కూతనూర్.
🍃🌷పోతన భాగవతంలోని ప్రథమ స్కంధంలోని ఒక పద్యం:
"శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభాకారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ!"
🌷పద్య భావం:
శరదృతువులో వెన్నెలతో ప్రకాశించే చంద్రునిలా, కర్పూరం, గంధంలా, తెల్లని హంసలా, మల్లెల దండలా, మంచులా, నురుగులా, వెండికొండలా, రెల్లుపువ్వులలా, ఆదిశేషుడిలా, అడవిమల్లెలా, అమృత సాగరంలో తెల్లని తామర పువ్వులా, గరుడవాహినిలా అనేక శ్వేత వర్ణాలతో ప్రకాశించే నిన్ను, ఓ సరస్వతీదేవి, ఎప్పుడు మదిలో చూడగలుగుతానో!
🌷వివరణ:
ఈ పద్యం ద్వారా పోతన సరస్వతీదేవి యొక్క సౌందర్యాన్ని, శ్వేత వర్ణాన్ని, ప్రకాశాన్ని వర్ణించడానికి అనేక ఉపమానాలను ఉపయోగించారు.
⚜️⚜️🌷🌷⚜️⚜️🌷🌷⚜️⚜️
🍃🌷శ్లోకం:
క్షోణితలంబున్ నుదురు సోకక మ్రొక్కినుతింతు సైకత శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి, రక్షితామర l
శ్రేణికి దోయజాతభవచిత్త వశీకరణైక వాణికిన్ వాణికి నక్షదామశుక వారిజపుస్తక రమ్యపాణికిన్ ||
🌷వివరణ:
నల్లని అందమైన శిరోజాలు గల తల్లికి, దేవతలను రక్షించే ఆమెకు, బ్రహ్మదేవునిI మనస్సును వశపరచుకున్న దేవికి, రుద్రాక్షమాల, చిలుక, పద్మం, పుస్తకాన్ని చేతులలో ధరించు వాణికి, సరస్వతీదేవికి, నా నుదురు నేలను తాకేటట్లు వంగి, భక్తితో నమస్కరిస్తాను.
ఈ సమస్త విశ్వం శబ్దమయం. నాదం తోనే జగత్ సృష్టి ప్రారంభమైంది. ఆ నాదశక్తికి ప్రతిరూపంగా, సరస్వతీ మాట బ్రహ్మవిద్యాస్వరూపిణియై శోభిస్తుంటుంది. విద్యకు అధిష్టాత్రి సరస్వతీదేవి. ఆ తల్లి మాఘశుద్ధ పంచమి నాడు అంటే శ్రీపంచమినాడు ఆవిర్భవించిందని శాస్త్రవాక్కు. శ్రీపంచమినాడు ఆవిర్భవించిందని శాస్త్రవక్కు. శ్రీపంచమినాడు విధిగా సరస్వతీదేవిని ఆరాధించాలని దేవి భాగవతం, బ్రహ్మవైవర్త పురాణాలు పేర్కొంటూన్నాయి.
శ్రీపంచమినాడు సరస్వతీదేవిని పుస్తకాలు లేక విగ్రహా రూపంలో ఆవాహన చేసి పూజిస్తే సర్వాభీష్టాలు నెరవేరుతాయని, జ్ఞాపశక్తి మేధ, బుద్ధి, వృద్ధి చెందుతాయని చెప్పబడింది. అందుకే ఈరోజున జ్ఞానాభివృద్ధి కోసం దేవతలు సైతం సరస్వతీదేవిని పూజిస్తారట.
శ్రీ వాగ్దేవి వందనము...శ్రీ సరస్వతీదేవి వందనము..🙏🙏
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

