శరన్నవరాత్రి ఉత్సవములు - శ్రీ రాజరాజేశ్వరీ దేవి
శ్రీ రాజరాజేశ్వరీ
రంగు: ఆకుపచ్చ
పుష్పం: ఎర్రని పుష్పాలు
ప్రసాదం: శాకాన్నం
దసరా నవరాత్రులలో పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి (విజయదశమి)గా అలంకరిస్తారు.
దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి. ఆస్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినది. ధర్మ విజయమునకు సంకేతముగా ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజును మహర్నవమిగా భక్తులు ఉత్సవము జరుపుకుంటారు. సింహ వాహనమును అధీష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపములో ఈ రోజు దర్శనమిస్తుంది.
అహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.
చండీ సప్తశతీ హోమము చేయవలెను.
నివేదన: చిత్రాన్నము, గారెలు, వడపప్పు, పానకము నివేదన చేయవలెను.
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉🕉️🕉
🍃🌷అమ్మవారు ఈ రోజున "శ్రీ రాజరాజేశ్వరీ దేవి" గా పూజలు అందుకుంటుంది.
🌷శ్రీ రాజరాజేశ్వరీ దేవి విశిష్టత:
జగన్మాత వివిధ రూపాల్లో అవతరించిన రాక్షసుల సంహారిణి (శ్రీ దేవీ మహత్యము – దుర్గా సప్తశతి): మధు-కైటభులు, మహిషాసురుడు, రక్తబీజుడు, ధూమ్రాక్షుడు, చండ-ముండులు, శుంభ-నిశుంభులను ఆమె సంహరించారు. రాక్షసులు వరప్రభావంతో దేవతలకు భయపెట్టినా, స్త్రీలను చులకన చేసినందున, అమ్మవారు వివిధ శక్తుల రూపాల్లో అవతరించి వారిని సంహరించిన శక్తి స్వరూపిణి.
విజయ దశమికి అమ్మవారి అల౦కారాలలో చివరి రూప౦ శ్రీ రాజరాజేశ్వరీ దేవి. ఈ అవతార౦లో అమ్మ ఒక చేతిలో చెరకుగడ, మరియొక చేతితో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శన౦ ఇస్తు౦ది. చెరకు రసం అత్మజ్ఞానమును సూచిస్తుంది. దుష్టులను, దురహ౦కారులను, శిక్షి౦చుటకు అ౦కుశ౦, పాశ౦ ధరి౦చి ఉ౦టు౦ది. ఆమె ప్రశా౦తమైన చిరునవ్వు, చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి. రాజరాజేశ్వరీ దేవి జ్ఞాన స్వరూపిణి. రాజ రాజేశ్వరీ దేవి అల౦కార ప్రియురాలు కావడ౦ వల్ల వజ్రాభరణాలను, పెద్ద కర్ణాభరణములను, భుజములకు రత్నములచే చేయబడిన ఆభరణములతో అల౦కరి౦పబడి ఉ౦టు౦ది.
ఈమె శ్రీ చక్రమునకు అధిష్టాన దేవత. మణిద్వీప శ్రీ నగర స్థిత చి౦తామణి గృహ నివాసిని. అక్కడ తన పరివారముతో కూడి మహాకామేశ్వరుని అ౦కము నిలయముగా చేసుకొని ఉ౦టు౦ది.
విజయదశమి రోజున శమీపూజ చేయడం ఒక ఆనవాయితీ. ఈ పూజ విజయసిద్ధిని ఇస్తుందని, శమీవృక్షాన్ని పూజించడం ద్వారా శనిదోషం నివారించబడుతుందని కూడా ప్రతీతి. ఈ పది రోజులూ పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు పంచిపెడితే సౌభాగ్యం లభిస్తుంది. దేవీభాగవత పారాయణం, శ్రీదేవీ సప్తశతీ నిత్యపారాయణం శ్రేష్ఠం. దుర్గా ద్వాత్రింశమాలాస్తోత్రం 108సార్లు పారాయణం చేస్తే అఖండఫలితాలు లభిస్తాయి, అలాగే కుమారీపూజను ఆచరించి మంచి ఫలితాలను పొందవచ్చు. రోజుకొక బాలికను పూజించాలి. వివిధ వయస్సులవాళ్ళు ఉంటే మంచిది. కేవలం 10 ఏళ్లలోపు బాలికలు మాత్రమే ఉండాలి. భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తల్లి రుణను కోరితే తప్పక ఆమె కరుణిస్తుంది.
⚜️అలంకరించే చీర: ఆకుపచ్చ/ఎరుపు
⚜️నైవేద్యంగా: లడ్డూలు, పులిహోర, బూరెలు, గారెలు.
⚜️చదువుకోవలసిన స్తోత్రాలు: రాజరాజేశ్వరి దేవి అష్టోత్తరం, కవచం, సహస్రనామ స్తోత్రం, శ్రీ విజయదుర్గా స్తోత్రం ఇత్యాదివి చదువుకోవాలి.
🍃🌷శ్రీ విజయ దుర్గా స్తోత్రము:
దుర్గాదుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ l
దుర్గమచ్చేదినీ దుర్గసాధినీ దుర్గానాశినీ ll
దుర్గాతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా l
దుర్గమ జ్ఞానదా దుర్గదైత్య లోకదవానలా ll
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
🍃🌷లలితా సహస్రనామాల్లో శ్లోకం 134 అత్యంత ఫలదాయకం.
రాజరాజేశ్వరీ, రాజ్యదాయినీ, రాజ్యవల్లభా ।
రాజత్-కృపా, రాజపీఠ నివేశిత నిజాశ్రితాః ॥ 134
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
“ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవతాయై నమః" అనే మంత్రం జపించుకోవచ్చు.
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
రాజరాజేశ్వరి దేవి యొక్క గాయత్రీ మంత్రం.
“అంబికాయై ధీమ హి తన్నోమాతః ప్రచోదయాత్ "
అనే మంత్రాన్ని జపించుకోవాలి.
🍃🌷దసరా సాధనాపర విశిష్టత:
దసరా అంటే ఏమిటి? మనలో ఉన్న పంచ జ్ఞాన, పంచ కర్మేన్ద్రియాలైన దశ ఇంద్రియాలు- దోపిడీ, హింస, స్త్రీ వ్యామోహం, లోభం, వంచన, పరుష వాక్కు, అసత్యం, పరనింద, చాడీ చెప్పటం, అధికార దుర్వినియోగం అనే దశ అంటే పది పాపపు పనులు చేస్తాయి. ఈ పది రకాల పాపాలు హరి౦చటానికి జగన్మాతను కొలిచే పండగనే ’’దశ హర‘’ అంటారు. అదే దసరా గా మారింది. ఈ పది పాపాల నుండి విముక్తిని ప్రసాదించి, మనందరి జీవితాలు సుఖసంతోషాలతో, సకల ఐశ్వర్యాలతో ఉండేలా చేయమని దుర్గామాతను వేడుకోవాలి.
🍃🌷విజయదశమి పండుగ విశిష్టత:
దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయ బడింది . 'శ్రవణా' నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి ,వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము .'చతుర్వర్గ చింతామణి 'అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటి నక్షత్రోదయ వేళనే 'విజయం ' అని తెలిపి యున్నది . ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము.
🍃🌷శ్రీ అపరాజితా దేవి స్తోత్రం:
నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః l
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ ll
రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః l
జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః ll
విజయదశమి పండుగ అపరాజిత పేరు మీద వస్తుంది. పరాజయం లేకుండా విజయాన్ని సాధించేది కాబట్టి, విజయదశమి అయింది.
పాండవులు శమీ వృక్ష రూపమున ఉన్న అపరాజిత దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు. అర్జునుడు దసరాలో జరిగే ఆయుధ పూజ ఆచారానికి పరోక్షంగా కారణమయ్యాడు, ఇది ప్రజలు తన ఆయుధాలను మరియు పరికరాలను పూజించడానికి దారితీసింది
శ్రీ రాముడు విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి విజయము పొందినాడు.
విజయదశమి రోజు పరాజయం లేని అపరాజితాదేవిని, శ్రీచక్ర అధిష్టాన దేవత, షోడశ మహావిద్యా స్వరూపిణి అయిన శ్రీ విజయదుర్గను, శ్రీ రాజరాజేశ్వరీదేవిని ఎవరైతే పూజిస్తారో! వారందరికీ ఖచ్చితంగా విజయం లభిస్తుంది.
అమ్మవారు పరమశాంత స్వరూపంతో, సమస్త నిత్యామ్నయ పరివార సమేతంగా, మహా కామేశ్వరుడుని అంకంగా చేసుకొని, ఆది పరాశక్తి రాజరాజేశ్వరి దేవిగా శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ, చెరకుగడను (ఇక్షుఖండం) ధరించి, ఒక చేతితో అభయ ముద్రతో దర్శనమిస్తుంది.
మణిద్వీప వర్ణనలో "శ్రీపురంలో చింతామణి "అనే గృహంలో నివసిస్తూ ఉంటుంది. చెడుపై సాధించే విజయమే విజయదశమి. ముఖ్యంగా మన మనసులో ఉన్న చెడు ప్రవర్తన మార్చుకుని (చెడుపై సాధించిన విజయంగా..) విజయదేవిని, విజయదశమి రోజు పూజిస్తే సర్వ శుభాలూ కలుగుతాయి.
ఈమె ఆది ప్రకృతి స్వరూపిణి, దుర్గాదేవి వివిధ కల్పాలలో, వివిధ రూపాలు ధరించి నానా దుష్టజనులని సహకరించి, లోకాలకి ఆనందం కలిగించింది.
శ్రీ రాజరాజేశ్వరీ దేవి కటాక్షములతో..
విజయదశమి శుభాకాంక్షలు..
శ్రీమాత్రే నమః….🙏🙏
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
