స్వాగతం అయ్యప్పా..... స్వాగతం అయ్యప్పా.....
నీ పూజకే నీకు పిలుపేందుకయ్యా,
స్వాగతం అయ్యప్పా.... ||2||
ఎలుక వాహనుడు గణపయ్య వచ్చాడు,
నెమలి వాహనుడు మురగయ్య వచ్చాడు ||2||
తమ్ముడు ఏడనీ మమ్మడుగుచున్నాడు ||2||
పరుగున రావయ్య పులి పైన అయ్యప్పా....
||స్వాగతం అయ్యాప్పా...||
నంది వాహనుడు ఆ శివుడు వచ్చాడు,
గరుడ వాహనుడు శ్రీ విష్ణువొచ్చాడు ||2||
తనయుడు ఏడని మమ్మడుగుచున్నాడు ||2||
ఆలస్యం ఏలయ్య హరి హర తనయ
||స్వాగతం అయ్యాప్పా...||
పూజ చేయగ గురుస్వాములొచ్చారు,
చిందులు వేయగా కణ్ణి స్వాములు వచ్చారు.. ||2||
భజన చేయగ నీ భక్తులొచ్చారు...||2||
కదలిరావయ్యా కాంతమలైవాస..
||స్వాగతం అయ్యాప్పా...||
అరటి ఆకుల పందిళ్లు కట్టాము,
పూలు పళ్ళన్నీ పడి నిండా పెట్టాము ||2||
ఆవు నెయ్యితో అరువాన్నమొండాము ||2||
ఆనందముగా ఆరగించి పోవయ్య...
||స్వాగతం అయ్యాప్పా...||