Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా - హనుమాన్ భజన పాటల లిరిక్స్

 పల్లవి :

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా

అంత భక్తి పరవశమా...ఓ కంట మమ్ము గనుమా

సరదాగా నా గాలిపాట వినుమా

విన్నాక బదులిచ్చి ఆదుకోనుమా

గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగా

నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమోకటేగా

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా

అంత భక్తి పరవశమా....ఓ కంట మమ్ము గనుమా


చరణం : 1

అమ్మల్లే నను పెంచింది ఈ పల్లెసీమ

నాన్నల్లే నడిపించింది ఊరంత ప్రేమ

అమ్మల్లే నను పెంచింది ఈ పల్లెసీమ

నాన్నల్లే నడిపించింది ఊరంత ప్రేమ

ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా

ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం

అన్ని సొంత ఇళ్ళే అంతా అయినవాళ్ళే

ఈ స్నేహబంధం నా పూర్వపుణ్యం

బతుకంతా ఇది తీరే రుణమా...

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా

అంత భక్తి పరవశమా.... ఓ కంట మమ్ము గనుమా


చరణం : 2

ఏ ఆటలాదిస్తావో ఓ కోతిబోమ్మా

ఏ బాటచూపిస్తావో కానున్న బ్రహ్మ

ప్రసన్నాంజనేయం అదే నామధేయం

ప్రతి మంచి కార్యం జరిపించు దైవం

ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం

నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం

నావెంటే నువ్వుంటే భయమా....


రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా

అంత భక్తి పరవశమా.....ఓ కంట మమ్ము గనుమా

సరదాగా నా గాలిపాట వినుమా

విన్నాక బదులిచ్చి ఆదుకోనుమా

గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగా

ని

త్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమోకటేగా

📢 Follow