(కార్తీకమాసం శుక్ల పక్షం)
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రభోధన ఏకాదశి ఉథ్థాన ఏకాదశి అని అంటారు !!
ఆషాడ శుద్ధ ఏకాదశినాడు అంటే తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి రోజు
పడుకున్న శ్రీమన్నారయణుడు ఈ రోజు
కార్తీక శుద్ధ ఏకాదశి రోజు "యోగనిద్ర"నుండి మేలుకుంటాడు అని పురాణ వచనం !!
అందుకే ఈ నాలుగు నెలలు సాధు సంతులు మహానీయులు చాతుర్మాస దీక్ష చేపట్టి అధ్యయన అధ్యాపనలు సాధనలు దీక్షలు చేస్తుంటారు !!
మానవ మాత్రుల మైన మనకు జీవ జాలానికి ఆహార నిద్రలు వుంటాయి కానీ భగవంతునికి నిద్ర ఏమిటి? అనే ప్రశ్న మనలో కలుగుతుంది! మనది భౌతికమైన నిద్ర ! స్వామిది "యోగనిద్ర" !!
పాల కడలిలో ఆదిశేషునిపై పడుకున్న స్వామి యోగవిద్రలో ఈ నాలుగు నెలలు ఏమి చేస్తాడు ?? అనే ప్రశ్న కు సమాధానం ఏమిచంటే.??
" సమస్త జీవులకు అంటె గతించి సూక్ష్మ శరీరాలతో ఆయా లోకాలలో సంచరించే జీవులకు వారి వారి కర్మానుసారం వారి వారికి ఏ ఏ జన్మలను ప్రసాదించాలని స్వామి ఆలోచిస్తూ యోగనిద్రను నటిస్తాడు" అని పెద్దలమాట!!
" వీడికి మంచి మానవ జవ్మనిచ్చాను ! ఏనాడు ఎవరికీ దానం చేయలేదు ! ఎవరికీ కనీస సహాయం కూడా చేయ లేదు ! ఒక మంచి పని కూడా చేయలేదు ! వాడికి వాక్కు ఇచ్చాను ! జీవితంలో ఏనాడు ఒక మంచి మాట మాట్లాడ లేదు ! భగవన్నామ స్మరణ చేయలేదు ! ఒక ధర్మ గ్రంథమైనా చదవలేదు ! ఒక మంత్రమైనా ఉచ్ఛరించ లేదు !వాడికి కాల్లు చేతులిచ్చాను ఏనాడు గుడికి వెల్లినది లేదు ! దీపం వెలిగించిన పాపాన పోలేదు !!
భగవంతునికి కానీ సర్వేశ్వర రూప సమాజ సేవ చేయలేదు!! దీనులు దుఃఖార్తులకు గానీ ఏనాడు పట్టెడన్నం పెట్టలేదు! సేవ చేయలేదు! ధర్మం అంటే తెలుసు కోలేదు !!
నేను నా శరీరం! నా ఇల్లు! అంతా నాదే ! అంతా నాకే కావాలని ఆరాట పడ్డాడు వీడికి మానవ జన్మ ఎందుకు?? దోచుకున్నాడు!!దాచుకున్నాడు!! అన్యాయం, అక్రమాలతో అధర్మంతో మానవజీవితాన్ని నాశనం చేసుకున్నాడు.!!
వీనికి #మానవజన్మ ఎందుకు.?? అని
' తిర్యక్ యోనుల' లో పడవేస్తాడు స్వామి!!
నేలకు అడ్డంగా పుట్టి అడ్డంగా పెరిగి అడ్డంగానే పోయేవాటిని తిర్యక్ యోనులు అంటారు ! అవే పశు పక్ష్యాదులు ఏ కుక్కనో నక్కనో ఏ పిల్లినో అన్నమాట !!
మంచి పనులు చేసి ఉత్తమమైన జన్మలను పొందుదాం !!
ఏనాటికైనా ఎన్ని జన్మలకైనా జన్మరాహిత్య' స్థితిని కైవల్యాన్ని ముక్తి ని సాధించటమే మానవ జీవన లక్ష్యం !!
" ముక్తి కోసం ముకుందుని పాదపద్మాలను శరణు వేడుదాం"!!
ఎన్నో జన్మల పుణ్యఫలము వలన ఈ మానవ జన్మ లభించింది!!
ఎంతో పుణ్యం చేసుకున్నాము కనుక ఈ
పవిత్ర పుణ్య భూమి భారతదేశంలో పుట్టాం!!
ఈ జన్మను వృధా చేసుకోకుండా వున్న దాంట్లో నలుగురికి సహాయ పడదాం !!
నీతి నియమాలతో భక్తితో ధార్మిక జీవనాన్ని
అలవరచుకుని మంచి మాటలు మాట్లాడదాం !!
" శాంతాకారం భుజగ శయనం పద్మ నాభం సురేశం!
విశ్వాదారం గగన సదృశం మేఘ వర్ణం శుభాంగమ్!
లక్ష్మీకాంతం కమల నయనం యోగీ హృద్యాన గమ్యం!
వందే విష్ణుం భవ భయహరం సర్వ లోకైక నాథమ్ " !!
🚩🚩🚩
*కార్తీక మాసం శివుడు, విష్ణువు ఆరాధనకు చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో శుక్ల పక్షంలోని ఏకాదశి కూడా గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది*
ఈ రోజును దేవుత్తాని ఏకాదశి అంటారు. దీన్ని ప్రబోధ ఏకాదశి, బృందావన ఏకాదశి అని కూడా పిలుస్తారు.
ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువు నాలుగు నెలల తర్వాత నిద్ర నుండి లేస్తాడు. ఈ రోజు వివాహాలతో సహా అన్ని శుభ వేడుకలకు నాంది పలుకుతుంది. దృక్ పంచాంగ్ ప్రకారం ఈ సంవత్సరం నవంబర్ 12, 2024న దేవుత్తాన ఏకాదశి జరుపుకుంటారు. ఈ సందర్భంగా విష్ణుమూర్తి, లక్ష్మి, తులసి మాతలను పూజిస్తారు. ముఖ్యంగా తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తారు. తులసి వివాహం కూడా ఇదే రోజు జరిపిస్తారు.
ఈ రోజున తులసి దేవి, శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి వివాహం జరిపిస్తారు. దేవుత్తాని ఏకాదశి నాడు మీరు కూడా విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి చాలా సులభమైన పద్ధతిలో పూజ చేయవచ్చు. దేవుత్తాని ఏకాదశి తిథి, పూజావిధి, పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం.
*దేవుత్తాని ఏకాదశి ఎప్పుడు?*
దృక్ పంచాంగ్ ప్రకారం దేవుత్తాని ఏకాదశి నవంబర్ 11, 2024న సాయంత్రం 06:46 గంటలకు ప్రారంభమై నవంబర్ 12న మరుసటి రోజు సాయంత్రం 04:04 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం దేవుత్తాని ఏకాదశి నవంబర్ 12 జరుపుకుంటారు.
*దేవుత్తాని ఏకాదశి పూజ విధి*
దేవుత్తాని ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిలో ఒక చిన్న పీట మీద ఎరుపు లేదా పసుపు వస్త్రం వేసి విష్ణుమూర్తి విగ్రహాన్ని ఉంచండి.
ఇప్పుడు విష్ణువు ముందు దీపం వెలిగించి పండ్లు, పువ్వులు, ధూపం, నైవేద్యాలు సమర్పించండి. పూజలో పంచామృతంలో తులసి ఆకు వేసి విష్ణుమూర్తికి సమర్పించాలి. సాయంత్రం విష్ణువును ఆచారం ప్రకారం పూజించండి. నెయ్యి దీపం వెలిగించండి. విష్ణువు, లక్ష్మీదేవికి ఖీర్ సమర్పించండి. విష్ణు సహస్ర నామం, బీజ్ మంత్రాలను జపించండి. దేవుత్తాని ఏకాదశి కథను వినండం లేదా చదవడం చేయాలి.
తొలి ఏకాదశితో చాతుర్మాసం ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. నాలుగు నెలల పాటు నిద్రలో ఉన్న శ్రీ మహా విష్ణువు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు మేల్కోంటాడు. దీన్నే దేవుత్తాని ఏకాదశి అంటారు. ఈరోజు ఉపవాసం ఉండి, విష్ణు పూజ చేస్తే అఖండ సంపద లభిస్తుంది. సర్వ పాపాలు తొలగిపోతాయి. ఏకాదశి ఉపవాసం ఆచరిస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు ఉపవాసం ఉన్న వారికి జీవితంలో దేనికి లోటు ఉండదు. ధనధాన్య వృద్ధి కలుగుతుంది. సంపద పెరుగుతుంది.
నిరాకరణ: ఈ కథనంలోని సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వాటిని స్వీకరించే ముందు సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.