శరణం శరణం శరణమప్పా స్వామియే శరణం శరణమప్పా //2//
అందాలయ్య ఓ శబరీషా దాసోహం నీ నామాలే భక్తుల పాటి ఆరాధ్యం
నీ దీక్షలో కలిగేనయ్య ఆనందం నీవే రక్షా అనుకుంటేనే అది మోక్షం
శరణం శరణం శరణమప్పా స్వామియే శరణం శరణమప్పా //2//
నిన్నే చేరీ ఆనందంగా కొలువంగా మాలో ఉన్న బాధలన్నీ తీరునయా
అయ్యా స్వామి మణికంఠ అని పిలువంగా నీవే వచ్చి మా కష్టాలు తీర్చువయ్యా
శరణం శరణం శరణమప్పా స్వామియే శరణం శరణమప్పా //2//
జీవితమందు ఒకసారి శబరీశ్వరుని చూడవలె
స్వామి అయ్యప్ప రూపమున కొలుచుటే జన్మకు పరమార్థం
శరణం శరణం శరణమప్పా స్వామియే శరణం శరణమప్పా //2//
మణికంఠునికై మండపము పదునెనిమిది మెట్ల సోపానం
జ్యోతి దర్శనం అద్బుతము బతుకునకదియే సాఫల్యం
శరణం శరణం శరణమప్పా స్వామియే శరణం శరణమప్పా //2//