పల్లవి
నిను తలువని రోజు ఉన్నదా.. అయ్యప్పా (కొరస్)
నిను కొలువని రోజు ఉంటదా.. అయ్యప్పా
నువు లేని చోటు ఉన్నదా.. అయ్యప్పా
నువు రావనే మాట ఉంటదా.. అయ్యప్పా
నిను తలువని రోజు లేదు .. నువు లేని చోటు లేదు నిను ధ్యానించకుంటే నాకసలే బతుకు లేదు
చరణం 1
నీ మాలలేసుకుంటిమి ...అయ్యప్పా
నియమాలననుసరిస్తిమి.. అయ్యప్పా
ఈ కటిక నేల మీదనే .. అయ్యప్పా
నినుగని నిదురపోతిమి ..అయ్యప్పా
నీమాలలేసుకుంటి ..నియమాలననుసరిస్తి దీపాల వెలుగుల్లో నీరూపు చూసుకుంటి..
చరణం2
మా కన్నె స్వామి నువ్వయా..అయ్యప్పా
మకున్న బలము నువ్వయ.. అయ్యప్పా
మా చిన్ని మణి కంటుడా.. అయ్యప్పా
మాకన్ని నువ్వెనయ్య ..అయ్యప్పా
మాకన్నె సామి నువ్వే.. మకున్న బలము నువ్వే ఎవరేమనుకున్న మరువము నీ శరణుగోష
చరణం 3
అన్నింట నువ్వేనయ్య....అయ్యప్పా
నిన్నంటి ఉంటామయ్యా .. అయ్యప్పా
మాఇంటినినోకంటితో... అయ్యప్పా
మంచిగ కనిపెట్టయ్య ..అయ్యప్పా
అన్నింట నువ్వెనయ్య .నిన్నంటి ఉంటమయ్య
ఈ ఒంట్లో పానం ఉన్నంత వరకు నిను మరువ...
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.