అయ్యరాయ్యరావయ్యో మణికంఠస్వామి నీకునా వందానాలురో......
మాలవేసినక్షణమే మహిమనీదితెలిసింది
మాలోని కామక్రోధ బందాలనుమలిపింది
సామాన్యుడిని నన్ను స్వామియనిపిలిచారు
సాక్షాత్తునీవేయని పాదసేవ చేశారు
నాకు తెలియక నాలోనా... మణికంఠస్వామి నీరూపమొచ్చిచేరేనా...
"అయ్యారవయ్య"
మండలవ్రతమందున మమ్ముల మేమరిచాము
ఈ జన్మ నీసేవకంకితమని తలచాము
నీసేవచేయఅన్ని జన్మలెత్తుతామయ్యా
ఆజన్మలెకుంటే బ్రహ్మనునిలదీస్తయ్య
నీపాద సేవ చేయగా....మణికంఠస్వామి ఈజన్మధన్యమవ్వదా.......
"అయ్యరావయ్య"
దేశాన్నిఏలేటి ఎంతపెద్ద రాజయిన
నిలువగనీడలేని కటిక నిరూపేదయిన
వేదాలు పటియించే వేదభ్రహ్మణులయిన
చదువు సంధ్యారాని సామాన్యజీవయిన
నీముందు అంతాఒక్కటే... మణికంఠస్వామి నినుచేరెదారిఒక్కటే....
"అయ్యరావయ్య"