గంగావతరణం(4)

P Madhav Kumar
2 minute read

ఓం
గంగావతరణం(4)

ప్రజలందరూ వెళ్ళి సగరుడికి అసమంజసుడి విషయం చెప్పారు. క్షత్రియుల ధర్మం తెలిసినవాడు కనుక, ప్రజలకు హాని చేసేవాడు తన కూమారుడైనా సరే అతనికి తగిన శిక్ష పడాలని అసమంజసుడికి రాజ్య బహిష్కారం విధించాడు సగరుడు.ఆనాడు లోకకంటకుడు కన్న కొడుకైనా శిక్షార్హుడే అని రాజులు నిరూపించారు. ఒక స్త్రీ మీద పైశాచికంగా అత్యాచారం చేసి, ఆమె చావుకు కారణమైనవారిని ఉరి తీస్తే తమను(వాళ్ళలో చాలామంది, వాళ్ళ పిల్లలూ అత్యాచారలు చేసినవాళ్ళే కనుక)కూడా ఉరి తీయవలసి వస్తుందని వాళ్ళను ఉరి తీయకుండా ఆపిన ఘనత ఈనాటి మన రాజకీయనాయకులది.


వంశకరుడిని కోరుక్కునాడు కనుక ఈ అసమంజసుడికి ఒక కూమారుడున్నాడు. అతని పేరు అంశుమంతుడు. అతను సగరచక్రవర్తి దగ్గరే ఉండిపోయాడు. అసమంజసుడు అడవులకు వెళ్ళిపోయాడు.

చాలా కాలం అయిపొయింది. సగర చక్రవర్తి ముసలివాడయ్యాడు. రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం ఆయన అశ్వమేధయాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. యాగం/యజ్ఞం ఎక్కడపడితే అక్కడ చేయకూడదు. దానికి శాస్త్రం కొన్ని ప్రదేశాలను చెప్పింది. యాగాలే కాడు ఏ పనైన సరే ఎక్కడ పడితే అక్కడ చేయాకూడదు. హిమాలయాలకు, వింధ్యపర్వతాలకు మధ్య ఉన్న భూమి పరమపవితమైంది. దాన్ని ఆర్యవర్తం అంటారు. అది యజ్ఞభూమి కనుక అక్కడ సగరచక్రవర్తి యాగం చేయాడానికి నిర్ణయించుకున్నాడు. దీక్షపరుడై కూర్చున్నాడు, యాగం మొదలుపెట్టారు, యాగానికి సంబంధించిన అశ్వాన్ని(గుర్రాన్ని) విడిచిపెట్టారు. అది గడ్డిమేస్తూ అన్ని ప్రాంతాలు తిరిగి ఆ ప్రదేశానికి చేరుకోవాలి. అప్పుడు యాగం పూర్తవుతుంది. చాలా కాలం గడిచిపొయింది. అశ్వం వెళ్ళింది కాని తిరిరాలేదు.

తన సింహాసనానికి అపాయం వస్తుందన్న భయంతో ఇంద్రుడు ఆ గుఱ్ఱాన్ని తీసుకువెళ్ళి, పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి ప్రక్కన విడిచిపెట్టాడు.

ఇప్పుడు మనందరికి ఒక అనుమానం తప్పకుండా వస్తుంది. యాగం చేస్తే ఇంద్రుని పదవికి ముప్పెందుకు వస్తుందని. అందరు చెప్తారు ఇంద్రుడు స్వర్గలోకానికి అధిపతి. స్వర్గంలో ఉంటాడాని. ఎక్కడ ఉంది ఆ లోకం అంటే ఎక్కడో లేదు. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఏ విధంగానైతే నీరు ఆవిరి(water vapour) రూపంలో ఉన్నా మనకు కనిపించదో అదే విధంగా ఎందరో దేవతలు, యోగులు, సిద్ధులు, మహర్షులు, యక్షకిన్నెరకింపురుషులు మన చుట్టూ ఉన్నా ప్రకృతిలోనూ, పర్యావరణంలోనూ, ఈ భూగోళమంతటా మానవనేత్రానికి కనిపించకుండా ఉన్నారు (మరింత వివ్రంగా మరొకమారు చెప్పుకుందాం, ఇప్పుడే వివరించడం మొదలుపెడితే అసలు విషయం నుండి దృష్టి మరలుతుంది). అందుకే ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడమని మన ధార్మిక గ్రంధాల్లోనే ఉంది. ప్రకృతిని(పర్యావరణాన్ని) నాశనం చేస్తే, అది ప్రకృతిలో ఉన్న దైవాలకు అపచారం చేసినట్లే అన్న విషయం జీవితాంతం గుర్తుపెట్టుకోండి.

యజ్ఞం ప్రకృతిలో ఉన్న దేవతలను సంతృప్తి పరుస్తుంది.యజ్ఞం చేయడం వలన ప్రకృతిలో చాలా మార్పులు సంభవిస్తాయి. మండు ఎండాకాలంలో, మిట్టమధ్యాహ్నం వేళ, కరువు ప్రాంతంలో కూడా యజ్ఞంతో వర్షం కురిపించవచ్చు. ఇది నిరూపింపబడింది. మీకు నా మీద నమ్మకంలేకపోతే 2-9-1993 నాటి ఆంధ్రజ్యోతి,9-10-1994 ఈనాడు దినపత్రికలు చూడండి. అంటే ఇప్పుడేం జరుగుతోంది. సమస్త ప్రకృతికి అధిదేవత ఇంద్రుడు. అతని ఆజ్ఞానుసారమే వర్షాలు కురుస్తాయి, గాలులు వీస్తాయి. యజ్ఞం చేయడం వలన మనిషి ప్రకృతిలో తనకు కావలసినవి పొందగలుగుతున్నాడంటే అది ఇంద్రుని ఆధిపత్యానికి, సింహాసనానికి గండి కొట్టినట్లే కదా.

అందుకే ఇంద్రుడు యాగాశ్వన్ని తీసుకుని వెళ్ళి తపస్సు చేస్తున్న కపిల మహర్షి వద్ద విడిచిపెట్టాడు. చాలా కాలం గడిచిపొయింది. అశ్వం వెళ్ళింది కాని తిరిరాలేదు.

to be continued............................

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat