గంగావతరణం(5)
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

గంగావతరణం(5)

P Madhav Kumar

ఓం
గంగావతరణం(5)

ఏదైన దీక్ష తీసుకునే ముందు చేతికి కంకణం కడతారు. అది దీక్ష పూర్తయ్యేవరకు తీయకూడదు. అటువంటి సమయంలో బంధువుల మరణాల కారణంగా వచ్చిన సూతకం ఆ దీక్షపరుడికి ఉండడు. దీక్ష ముగిసిన తరువాత సాధరణంగా సూతకం ఎన్నిరోజులుంటుందో అన్ని రోజులు పాటించాలి. సగరచక్రవర్తి తన 60,000 మంది సగరులను పిలిచి, తాను కంకణం ధరించాడు కనుక యాగం మధ్యలో లేవకూడదని, ఇంద్రుడు తన పదవి కోసం అశ్వాన్ని దొంగిలించుంటాడు. అందువల్ల భూగోళమంతా గాలించమని ఆజ్ఞాపించాడు. అంతా వెతికినా గుర్రం కనపడక తిరిగివచ్చారు సగరులు. భూగోళమంతాట వెతికినా కనపడలేదన్నారు.


ఇంద్రుడు అశ్వాన్ని పాతాళంలో దాచిఉంటాడని గ్రహించి మీరు 60,000 మంది ఉన్నారు, ఈ భూగోలమంతా మీ 60,000 మంది 60,000 యోజనాలు వెతకండి అన్నాడు సగర చక్రవర్తి. ఎలా వెతుకుతారో తెలుసా? మీకు వజ్రముల వాంటి గోర్లున్నాయి. ఒక్కొక్కరు ఒక్క యోజనం చొప్పున 60,000 యోజనాల భూమినిలో ఉన్న మట్టిని పెకిలించండి, భూమిని నాగళ్ళు పెట్టి తవ్వేయండి, గునపాలతో చీల్చేయండి, పాతాళానికి వెళ్ళి గుర్రాని తీసుకురండి అన్నాడు సగర చక్రవర్తి. 60,000 మంది భూమిని తవ్వడం, చీల్చేయడం మొదలుపెట్టారు.

ఇది చూసిన దేవతలు పరుగుపరుగున బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు. ఈ భూగోళమంతా దైవశక్తులు ఉంటాయి. పంచమహాభూతాలు (ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి/పృధ్వీ ) ఉంటాయి. చెట్లను ఆకారణంగా నరికేయడం, కుదురుగా ఉండలేక పువ్వులు, మొగ్గలు, ఆకులు తెంపడం, పంచభూతాలకు ఇబ్బంది కలిగించడం అంటే కలుషితం చేయడం వంటివి శాస్త్రం నిషేధించింది ( మనం కూడా ఇప్పుడు అదే చేస్తున్నాం. భూమిని రోజురోజుకు వెడెక్కిస్తున్నాం, ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు పడేస్తున్నాం, నదులను, గాలిని, ఆకాశాన్ని, భూమిని కలుషితం చేస్తున్నాం. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా వాడేస్తున్నాం, ప్రకృతిని దోచేస్తున్నాం, భూతాపాన్ని పెంచేస్తున్నాం). ఇవన్ని దేవతలు అపచారం చేయడమే. అందుకే పర్యావరణాన్ని పరిరక్షించండి. వారు వారి ధర్మాన్ని పాటించడం మరిచిపోయి, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా వెళ్ళారు. అందుకే 12 మంది ఆదిత్యులు, 11 రుద్రులు, అష్ట (8) వసువులు, 2 అశ్విని దేవతలు వెళ్ళారు. వీరందరూ కలిపి 33. మొత్తం 33 కోట్ల దేవతాగణాలు సగరులు చేస్తున్న అకృత్యాన్ని సహించలేక పరుగుపరుగున బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు.

to be continued..............................

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow