ఓ హరిహర నందనుడా స్వామియే శరణం అయ్యప్ప
శరణమయ్యా స్వామి శరణమయ్యా స్వామి
1. విల్లాలి వీరుడవు వీరమణికంఠుడవు
మమ్మేలవస్తావని మమ్మాదుకుంటావని
నీ మాలలువేసి పూజలుచేసి నిన్ను వేడినమూ శరణమయ్యాస్వామి శరణమయ్యాస్వామి
|॥ ఓం హరిహర॥
2. తల్లిదండ్రితో కూడ చెప్పలేని బాధలను
మా ఆత్మీయుడవని నమ్మి నీతో చెప్పుకున్నాము
అన్ని తెలిసిన నీకే మాపై ఆలక ఎలాయ్యా.......శరణమయ్యాస్వామి శరణమయ్యాస్వామి
|॥ ఓం హరిహర॥
3. మరు జన్మమమే యుంటే మానవ జన్మ వద్దయ్యా
ఈ బాధలొద్దయ్య ఈ బందాలొద్దయ్య
ఒక రోజు వెలిగే దీపమై నీ గుడిలో వెలగాలి......శరణమయ్యాస్వామి శరణమయ్యాస్వామి
॥ఓం హరిహర॥