అళుదా అలలపైన ఉయ్యాలలూగేటి... (కో )
అయ్యప్ప స్వామిని శరణనుచు వేడండి..... (కో )
కష్టాలు కడతేర్చును స్వాములు
కరుణించి కాపాడును...(కో )
( అళుదా అలలపైన )
ఎరుమేలి ఎట్రము ఎంతో పవిత్రము.. (కో )
కరిమల ఎట్రము కఠినము కఠినము... (కో )
అళుదా మేడు మెట్లపై స్వాములు అయ్యప్ప అలరారును...... (కో )
( అళుదా అలలపైన )
పెరియాన వట్టము పెన్నిదై నిలుచును... (కో )
చెరియాణ వట్టము సిరులు కురిపించును... (కో )
పంబా నదీ స్నానము స్వాములు
పాపాలు తొలగించును... (కో )
( అళుదా అలలపైన )
నీలిమల ఎట్రము నిందలను బాపును.... (కో )
అప్పాచి మేడు ఆపదలు ఆపును.... (కో )
శబరి పీఠం మొక్కుతూ " సాగుతూ"
శరంగుత్తి చేరాలయా.... (కో )
(అళుదా అలలపైన )
పదునెనిమిది మెట్లు మొక్కుతూ ఎక్కుతూ... (కో )
హరిహర పుత్రుని కనులార దర్శించ... (కో )
జగదేక వీరుడండీ స్వాములు
జగమేలే దేవుడండీ... (కో )
(అళుదా అలలపైన.....)
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.