ఎవరన్నారయ్యా నువ్వు లేవనీ..
ఎవరన్నారయ్యా కాన రావనీ..
నిను నమ్మిన భక్తులకు నిజమై నీవున్నావు..
నిను కొలిచే కన్నులకు కనిపిస్తూ ఉంటావు..
ఎవరేమన్నా అనుకున్న నిను మరువనయ్యా ఆ..
శరణమయ్యప్ప స్వామీ అయ్యప్పా శరణాలు
మరువలేను విడువలేను అయ్యప్ప..
ఎవరన్నారయ్యా నువ్వు లేవనీ..
ఎవరన్నారయ్యా కాన రావనీ ..
కన్నె స్వామినై నేను మాల వేసుకున్నప్పుడు
కన్న తల్లితండ్రి నిడిసి నేను కఠిన దీక్ష చేసినపుడు
కత్తి స్వామీ ఉన్నప్పుడు కష్టాలు తొలిగెనప్పుడు
కట్టుకున్న ఇరుముడి తలనెట్టి పయనమైనప్పుడు
పుట్టెడన్ని బాధలు కన్నీళ్లు తొలిగెను..
పట్టరాని ఆనందం నాకు కలిగెను ..
పుట్టెడన్ని బాధలు కన్నీళ్లు తొలిగెను..
పట్టరాని ఆనందం నాకు కలిగెను ..
ఎవరేమన్నా అనుకున్న నువు మా వరము ..
శరణమయ్యప్ప స్వామీ అయ్యప్పా శరణాలు
మరువలేను విడువలేను అయ్యప్ప..
కంఠస్వామీ నైనప్పుడు గుండెల నీ గుడి నీ కట్టి
గుర్తుకొచ్చినప్పుడల్ల జ్ఞాన జ్యోతి వెలిగించి గదా
స్వామీ నైనప్పుడు ఘడియ ఘడియ పూజిస్తి..
పేరూ స్వామీనై ప్రేమతో నీకు సేవలే చేస్తే..
జ్యోతి స్వామినైనప్పుడు జోల పాడితి
సూర్య స్వామినై నేను సిరులు పొందితీ..
జ్యోతి స్వామినైనప్పుడు జోల పాడితి
సూర్య స్వామినై నేను సిరులు పొందితీ..
ఎవరేమన్నా అననీ మా ప్రాణమైతివీ ..
శరణమయ్యప్ప స్వామీ అయ్యప్పా
శరణాలు మరువలేను విడువలేను అయ్యప్ప..
చంద్ర స్వామినైనప్పుడు చల్ల చలిని తట్టుకున్న
విశూల స్వామిగా మాలను వేసి భక్తి నిలుపుకున్న
విష్ణుచక్ర స్వామినై వేదాలు నేర్చుకున్న శంఖధారా
సమయాన శక్తి నేను పెంచుకున్న నాగభరణ స్వామినై
ననుజ్ నను నేను మరిచినా శ్రీహరి స్వామిని నేనై
స్వార్ధమునే వదిలినా నీ పాద పద్మములకు
పద్మ స్వామీ నైనా శ్రీశబరి గిరీ స్వామిగా
సర్వం నిను కొలిచిన నారికేళ స్వామిగా నీ పేరు నిలిపితి ..
శరణమయ్యప్ప స్వామీ అయ్యప్పా
శరణాలు మరువలేను విడువలేను అయ్యప్ప..
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.