నీ నామ స్మరణ లేక శరణమయ్యప్ప
అడుగు కూడా వెయ్యలేము శరణ మయ్యప్ప
ఒక్క అడుగు కూడా వెయ్యలేము శరణ మయ్యప్ప
శరణ మయ్యప్ప స్వామి శరణ మయ్యప్ప
స్వామియే శరణం శరణ మయ్యప్ప " నీ నామ "
ఎరుమేలి చేరినాము శరణ మయ్యప్ప
పేట తుళ్ళి ఆడినాము శరణ మయ్యప్ప
పెద్ద పాద మేక్కుతుంటే శరణ మయ్యప్ప
నా పెద్ద పాన మెల్లి పాయె శరణ మయ్యప్ప " నీ నామ "
అలుద కొండ ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
కడుపు నిండా ఆకలాయే శరణ మయ్యప్ప
ఆకలంత ఆపుకుంటూ శరణ మయ్యప్ప
అలుద కొండ ఎక్కినాను శరణ మయ్యప్ప "నీ నామ"
కరిమలనే ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
నా కళ్ళ నీళ్లు తిరిగే శరణ మయ్యప్ప
కళ్ళ నిండా నీళ్ళ తోని శరణ మయ్యప్ప
కరిమలనే ఎక్కినాను శరణ మయ్యప్ప " నీ నామ "
చిన్న పాద మేక్కుతుంటే శరణ మయ్యప్ప
చిన్న పాన మేల్లిపాయే శరణ మయ్యప్ప
నీలి మల ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
మా తల్లి తండ్రి గుర్తు కొచ్చే శరణ మయ్యప్ప " నీ నామ "
సన్నిధానం చేరినాము శరణ మయ్యప్ప
మకర జ్యోతి చూసినాము శరణ మయ్యప్ప
మకర జ్యోతి చూసి మేము శరణ మయ్యప్ప
బాధలన్ని మరచి నాము శరణ మయ్యప్ప " నీ నామ "