వీరాది వీరుడవయ్యో...అంజన్న వీరంజనీయుడవో..
అతులిత బలదాముడివో అబ్బబ్బ అవనికి దేవుడివో.../2/
వీర విక్రముడు నీవే...ఆహా...
వీర దిక్కజుడు నీవే.. ఓహో...
రాక్షససంహారి నీవే...ఆహా...
సూర్యుడినే మింగబోయినా శక్తి స్వరూపుడివో....
భలే భలే భలే భలే.....
రామయ్య పాదము తాకా... ఆహా..
రావణ లంకకు పోయి ...ఓహో..
సీతమ్మ జాడ కనుక్కొని...ఆహా..
అసురులు తాట కట్టించి..ఓహో...
చూసి రమ్మంటే రావణ లంకను కాల్చి వచ్చినావో...
భలే భలే భలే భలే.....
నీకున్న శక్తిఎంతో హనుమా..ఓహో
నీకే తేలిదట స్వామి...ఆహా..
ఇతరులు పొగిడిన చాలు ...ఆహా..
ఇంతంత కొండత అయ్యే...ఓహో...
చిటికిన వ్రేలితో పర్వతాలను మోసే గరుడవయో..
భలే భలే భలే భలే.....
చదవని వేదాలు లేవు...ఆహా..
తెలియని విద్య అంటూ లేదు..ఓహో..
సర్వము తెలిసిన హనుమా...ఆహా..
గర్వము ఎరుగను తండ్రి..ఓహో..
నీ సరి నీవే హనుమయ్య తండ్రి వేరెవరూ లేరయ్యో...
భలే భలే భలే భలే.....
వీరాది వీరుడవయ్యో...అంజన్న వీరంజనీయుడవో...
అతులిత బలదాముడివో అబ్బబ్బ అవనికి దేవుడివో.../2/
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.