శివ నామమే నా గానము, ఓంకారమే నా ప్రాణము - శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
0 minute read

 

సాకి...
శిరమున గంగను మోయుచు
కరమున ఢమరుకము దాల్చి కడు భీకరమౌ
యురగము మెడలో నాడగ
పరికింతువు భక్త జనుల మానస తలపుల్.


పల్లవి....
శివ నామమే నా గానము,
ఓంకారమే నా ప్రాణము

అను పల్లవి...
శంభో శంకర, సాంబ సదాశివ,
కైలాస వాస, గిరిజా రమణా.


చరణం...
నీ గుణ గానము చేసెదమయ్యా
సరిగమ పదనిస స్వరములు పలుకగ
భరత నాట్య విన్యాసము చూపిన
భయ నాశంకర భవహర శంకర.   !! శివ !!


చరణం...
నీ గళమందున గరళము నింపి
ప్రళయమునాపిన ప్రణవ మూర్తివే
భజనలు చేసే భక్త జనావళిని
బ్రోవగ రావా గావగ లేవా.    !! శివ !!


చరణం...
నంది వాహనా నాగాభరణా
పార్వతి రమణా పన్నగ భూషణ
ఫాల విలోచన పాప విమోచన
పరమ దయాకర పాహి ప్రసన్నా    !! శివ !!

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat