శంభో మహేశ ఈశా మాంపాహి ఈశ్వర
భక్తితో పదాలు చేర్చి శరణంటి కావర
ముల్లోకాలకు నీవే దిక్కని పలికెను పదాల శుక్రుడు
శివుని శక్తికి ఎదురేలేదని ఓడెను అసురుల గురువు
ఆఆ..ఆ..ఆ...ఆఆ....
జగమంత నీవే దేవా - విశ్వేశ్వర ఈశా
గంగను కోరి వేడెను నిన్ను ఆ భగీరధుడు ఈశా
గంగను ఇచ్చి కరుణ చూపేవు ఓ గంగాధర ఈశా
ఆఆ..ఆ..ఆ...ఆఆ....
సాంబశివ ఈశా శంభో హర హర మహాదేవ
ఎత్తు బడి: గంగాధర... మల్లేశా... శంభో... మల్లేశా....