అంజని తనయుడా రావా - నీ అభయ మీయగా దేవా - హనుమాన్ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


పల్లవి : 

అంజని తనయుడా రావా - నీ అభయ మీయగా దేవా
అంజని తనయుడా రావా - నీ అభయమీయగా దేవా    || అంజని ||

చరణం 1: 

వానర వీరా వాయు కుమారా నిన్నే పూజించా
పూలను కోసి మాలలు చేసి నీమెడ వేసాము   || అంజని ||

చరణం 2: 

సింధూరమునే తిలకము దిద్ది గంధము పూసాము
తమల పాకులతో పూజలు చేసి భక్తితో కొలిచాము    || అంజని ||

చరణం 3: 

దయగల స్వామివి నీవేననుచు నీ  [ దరి ]  చేరాము
దీన జనావన నీవే దిక్కని శరణము కోరాము   || అంజని ||

చరణం 4: 

రామ విధేయా మారుతి రాయా అంజలిదే గొనరా
అగణి శూరా ఓ కపివీరా కావగరావేరా   || అంజని ||

చరణం 5: 

నీ నామమునే తలచిన చాలును భయమే రాదయ్యా
భూత గణములు దుష్టశక్తులు దరికే రావయ్యా    || అంజని ||

చరణం 6: 

నీ చరణములే వేడిన వారికి శుభముల నొసగెదవు
నిరతము నిన్నే నమ్మిన అప్పన్న దాసుని కావుమయా   || అంజని ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat