దయగల లక్ష్మికి మించిన దేవత లేనే లేదుగా - అమ్మవారి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


దయగల లక్ష్మికి మించిన దేవత లేనే లేదుగా
ఎన్ని లోకములు వెదకి చూసినా లక్ష్మీ కనరాదు - శ్రీ లక్ష్మీ కనరాదు

మాతృ దేవతగ మనుగడ జేసి పూలతో పూజించి
అభిమానంతో అమ్మను కొలచి పూజలు చేసెదము - అమ్మా పూజలు చేసేదము

కలలో నిలచిన చల్లని తల్లీ ఇలలో కొచ్చెనుగా
హృదయము మనము అర్పించినచో మదిలో నిలచునుగా - మన మదిలో నిలచునుగా 

ఉన్నవాడినని ఉలుకు పాటుతో పరుగులు తీయబోకు
దాన ధర్మములు చేసిన వారు ధన్యులు అవుతారు - వారు ధన్యులు అవుతారు

ముళ్ళ బాటలో పయనం చేసి మూర్ఖుడవవ బోకు
ఎదుటి వారిలో ఏదో వెతికి వేదన చెందకుము - నీవు వేదన చెందకుము

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat