ఆనందం పరమానందం అయ్యప్ప దర్శనం ఆనందం
శబరిగిరీశ్వర దివ్యకళేబర దర్శనభాగ్యం ఆనందం
అద్భుత దర్శన మానందం – మంగళదర్శన మానందం
శబరిగిరీశ్వర దివ్యకళేబర – దర్శనభాగ్యం ఆనందం
కనక కిరీటం ఆనందం – తిలకలలాటం ఆనందం
కుండల మండల కంఠస్ధలము – తిలకలలాటం ఆనందం
కరుణకాక్షం ఆనందం -తిరునాసికముం ఆనందం
మందస్మిత మనోహర వదనం – ఆనందం పరమానందం
దివ్యాభరణం ఆనందం – మణీకంఠనామం ఆనందం
శ్యామలకోమల వక్షోభాగం – ఆనందం పరమానందం
ముద్రాంకితకర మానందం – భద్రాసనము ఆనందం
నీలాంబరపరమేష్టికాంతయు – ఆనందం పరమానందం
ధృక్పాదాంబుజ మానందం – తిరునాపురం ఆనందం
అద్భుతవిగ్రహకరుణాసాగర – చిన్మయరూపం ఆనందం
పాదాదికేశం ఆనందం – కేశాదిపాదం ఆనందం
శబరిగిరీశ్వర దివ్యకళేబర దర్శనభాగ్యం ఆనందం ||ఆనదం||