జగమంత నీవేకదా మాయా
జంగమయ్య దేవా జంగమయ్యా
॥జడలు||
ముక్కంటి ఈశ్వరుడవు - ముల్లోక పూజుడవు
ముక్కోటి దేవతల మూలమే నీవయ్య
మునులు సురులంతా నిను కొలిచేను జగమంతా
హరోంహర హరహర హరోంహర ॥2॥
॥జడలు||
గలగలపారే గంగను జడలోన పెట్టినవా
అర్థభాగం సతికిచ్చిన అర్థనారీశ్వరుడా
గరళాన్ని దాల్చిన గరళాకంఠుడవయ్య
జంగమయ్య దేవా జంగమయ్యా ॥2॥
||జడలు||
చంద్రున్ని కొప్పున పెట్టిన చంద్రమౌళీశ్వరుడ
నందీవాహనమెక్కిన నాగాభరణుడవు
పులిచర్మదారుడవు స్వశాన సంచరుడవు
హరోంహర హరహర హరోంహర ॥2॥
||జడలు||