రామ గోవింద స్వామి రాఘవేంద్ర,
నా మీద దయ లేదా నిన్నేనమ్మితిరా
ఒక్కసారి చూపుమా నీ ప్రేమసత్యమైన తండ్రి ఓ రఘురామా
అందాల సీతమ్మతో కొలువైయున్నావు,
భద్రాది ఆలయమున వెలసియున్నావు.
దిక్కంటే నీవే రా దీనులకైనా.
మొక్కెము కరుగదా హృదయమైన @ రామ
శ్రీరామ శరణుంటిని నిన్నే శుభనామా,
పరమాత్మ భజయింతును నిన్నే గుణధామ.
ధర్మమూర్తి అన్న పేరు విన్నాను
దారి చూపే దాత వంటే నీవే ఓ రఘురామా @ రామ @
సాకేత శ్రీరామ తారక నామ ఓం,
నీ నామ మహిమను తెలియక తరమా
ఆనంద మా జన్మ సార్థకమవుతుందా
నిన్ను మించిన దైవము వేరొకటుందా @ రామ @
నిర్మలాత్మ మా దీన గాధ వినరావా
ఈ దీనుల కాపాడవా రావా ఓ దేవా @ రామ @
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.