54. అందాల దేవుడు అమరేశ్వరుడే - శివ భజన పాటల లిరిక్స్
January 03, 20250 minute read
అందాల దేవుడు అమరేశ్వరుడే
కైలాసనాథుడు కారుణ్య రూపుడే
గంగమ్మ గౌరమ్మ గారాల నాధుడే
గరలాన్ని మింగిన ఘనమైన దేవుడే
🙏ఏమీ లేకపోయినాడే ఎద్దు నెక్కి వచ్చినాడే
ముల్లోకలేలేటి ముక్కంటి దేవుడమ్మ
🙏మేడలేమో లేకపోయే కొండాలంటే కోరిక
విభూది రేఖలు అంటే నీకెంతో ఇష్టమాయే
🙏నగలేమో లేకపోయే నాగులేమో మెడనాయే
వల్లకాటిలోన నీకు పల్లకీలు పాన్పులాయే
Tags